అన్‌సీజన్‌లో పనస పండ్లు
ABN , Publish Date - Feb 14 , 2026 | 11:28 PM
మండలంలోని చౌడుపల్లిలో అభ్యుదయ రైతుల పెరటిలో అన్‌సీజన్‌లో ఓ పనస చెట్టుకు రెండు పండ్లు కోతకు వచ్చాయి.
చౌడుపల్లి అభ్యుదయ రైతు
పెరటిలో కాసిన నాలుగు కాయలు
ఏప్రిల్ నుంచి జూలై వరకు
పనస కాయలు కాస్తాయి..
ఆశ్చర్యపోతున్న రైతు, గిరిజనులు
చింతపల్లి, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి):
మండలంలోని చౌడుపల్లిలో అభ్యుదయ రైతుల పెరటిలో అన్‌సీజన్‌లో ఓ పనస చెట్టుకు రెండు పండ్లు కోతకు వచ్చాయి. చౌడుపల్లికి చెందిన అభ్యుదయ రైతు కంటా రమణ నాలుగేళ్ల క్రితం పెరటిలో పనస మొక్కను నాటారు. గత ఏడాది నుంచి ఈ మొక్క కాపుకొచ్చింది. సాధారణంగా ఏప్రిల్ నుంచి జూలై వరకు పనస కాయలు కాస్తాయి. అందుకు భిన్నంగా అభ్యుదయ రైతు పెరటిలోని పనస చెట్టు అడుగు భాగం, కొమ్మల్లో రెండు నెలల క్రితం నాలుగు పనస కాయలు కాసింది. రెండు పండ్లు ప్రస్తుతం కోతకు వచ్చాయి. మరో రెండు కాయలు రెండు వారాల్లో పండనున్నాయి. అన్ సీజన్‌లో పనసకాయలు రావడంతో స్థానికులు, అభ్యుదయ రైతు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.