Share News

ముఖంచాటేస్తోంది!

ABN , Publish Date - Apr 07 , 2026 | 11:44 PM

ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఐరిస్‌ విధానాన్ని తీసుకొచ్చింది. ఎన్‌ఎంఎంఎస్‌ యాప్‌ను అప్‌గ్రేడ్‌ చేసి ఎఫ్‌ఆర్‌ఎస్‌ను అమలులోకి తెచ్చింది.

ముఖంచాటేస్తోంది!
కొర్రాలో ముఖ హాజరుకు తిప్పలు పడుతున్న ఉపాధి కూలీలు

ఉపాధి హామీ పథకంలో ఐరిస్‌ విధానంతో అవస్థలు

ముఖ హాజరు నమోదు కాకపోవడంతో పనులకు కూలీలు దూరం

డుంబ్రిగుడ, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఐరిస్‌ విధానాన్ని తీసుకొచ్చింది. ఎన్‌ఎంఎంఎస్‌ యాప్‌ను అప్‌గ్రేడ్‌ చేసి ఎఫ్‌ఆర్‌ఎస్‌ను అమలులోకి తెచ్చింది. ప్రతి కూలి తన కనుపాపలను యాప్‌ ద్వారా స్కాన్‌ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే పేరు నమోదు చేసుకుని ఈకేవైసీ చేయించుకున్నారో వారు పనికి వెళితేనే హాజరైనట్టు గుర్తించేలా సాంకేతిక విధానాన్ని రూపొందించారు. నూతన ఆర్థిక సంవత్సరం నుంచి కూలీల హాజరు నమోదుకు ముఖ గుర్తింపు విధానం అమలు చేశారు. ప్రస్తుతం తీసుకొచ్చిన ఐరిస్‌ విధానం కారణంగా కొందరు కూలీలు పనులకు దూరమవుతున్నారు. మండలంలోని కొర్రా పంచాయతీలో 1,178 మంది కూలీలు ఉండగా, వారిలో ఐరిస్‌ యాప్‌లో ముఖ హాజరు 70 శాతం మందికి నమోదు కావడం లేదు. దీంతో వారు పనికి దూరమవుతున్నారు. యాప్‌ అప్‌గ్రేడ్‌ చేసిన తరువాత ఈ ఇబ్బంది వచ్చిందని సిబ్బంది చెబుతున్నారు.

Updated Date - Apr 07 , 2026 | 11:44 PM