Share News

మోసం గురూ!

ABN , Publish Date - Jun 15 , 2026 | 12:25 AM

అతని వృత్తి విద్యా బోధన. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తూ మరోవైపు ప్రైవేటు చిట్స్‌, ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తున్నారు. అయితే కొంతకాలం నుంచి చీటీలు పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదు. అదే విధంగా వడ్డీకి డబ్బులు ఇచ్చిన వారికి తిరిగి చెల్లించడంలేదు. డబ్బులు అడిగితే ఇదిగో.. అదిగో అంటూ కాలయాపన చేస్తుండడంతో పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదులు చేశారు. ఇందుకు సంబంధించి వారు తెలిపిన వివరాలిలా వున్నాయి.

మోసం గురూ!
పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న బాధితులు

చీటీలు, ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తున్న ఉపాధ్యాయుడు

పలువురికి డబ్బులు ఎగవేత

పోలీసులకు బాధితుల ఫిర్యాదు

రూ.5 కోట్ల వరకు ఉంటాయని అంచనా

మాకవరపాలెం, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): అతని వృత్తి విద్యా బోధన. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తూ మరోవైపు ప్రైవేటు చిట్స్‌, ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తున్నారు. అయితే కొంతకాలం నుంచి చీటీలు పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదు. అదే విధంగా వడ్డీకి డబ్బులు ఇచ్చిన వారికి తిరిగి చెల్లించడంలేదు. డబ్బులు అడిగితే ఇదిగో.. అదిగో అంటూ కాలయాపన చేస్తుండడంతో పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదులు చేశారు. ఇందుకు సంబంధించి వారు తెలిపిన వివరాలిలా వున్నాయి.

మండలంలోని రామన్నపాలెం గ్రామానికి చెందిన యకా అప్పలనాయుడు జి.వెంకటాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. ఇతను సుమారు పదేళ్ల నుంచి చీటీలు, ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తున్నారు. కొంతకాలంపాటు చీటీలు పాడుకున్న వారికి, వడ్డీకి డబ్బులు ఇచ్చిన వారికి సక్రమంగానే తిరిగి చెల్లించారు. అయితే సుమారు ఏడాదిన్నర నుంచి చీటీల వ్యాపారం ఆపేశారు. చీటీలు పాడుకున్న వారితోపాటు పూర్తిగా కట్టిన వారికి డబ్బులు చెల్లించడంలేదు. దీంతో కొంతమంది బాధితులు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో ఆధివారం రామన్నపాలెం గ్రామానికి చెందిన కొంతమంది బాధితులు, ఉపాధ్యాయుడు అప్పలనాయుడు ఇంటి వద్దకు వెళ్లి టెంట్‌ వేసి నిరసన తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రామన్నపాలెం వెళ్లి టెంట్‌ తీసివేసి, పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని బాధితులకు చెప్పారు. దీంతో సుమారు 20 మంది పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.

ఉపాధ్యాయుడు అప్పలనాయుడుకు తాను రూ.5 లక్షలు వడ్డీకి ఇచ్చానని, మరో రూ.10 లక్షలు చీటీ వేశానని, ఏడాదిన్నర క్రితం చీటీలు నిలిపివేశాడని, డబ్బులు అడిగితే ఇదిగో.. అదిగో అంటూ కాలయాపన చేస్తున్నాడని రామన్నపాలెం గ్రామానికి చెందిన యకా పోతురాజు ఫిర్యాదులో పేర్కొన్నారు. చీటీలు, వడ్డీకి తీసుకున్న డబ్బులు కలిపి ఒక్క రామన్నపాలెంలోనే రూ.2 కోట్లు వుంటాయని, మండలంలో మొత్తం మీద సుమారు ఐదు కోట్ల రూపాయల వరకు వుంటాయని బాధితులు చెబుతున్నారు. దీనిపై ఎస్‌ఐ. దామోరనాయుడుని ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. చీటీలు, ఫైనాన్స్‌ వ్యాపారం చేసిన ఉపాధ్యాయునిపై పలువురు ఫిర్యాదులు చేశారని, వీటిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - Jun 15 , 2026 | 12:25 AM