జీసీసీ కాఫీ ప్రొక్యూర్‌మెంట్ ఆఫీసర్‌గా ఐటీడీఏ పీవో నియామకం
ABN , Publish Date - Jan 01 , 2026 | 11:13 PM
గిరిజన సహకార సంస్థ (జీసీసీ) కాఫీ ప్రొక్యూర్‌మెంట్ అధికారిగా ఐటీడీఏ పీవో టి.శ్రీపూజను నియమిస్తూ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి ఎంఎం.నాయక్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఉత్తర్వులు జారీ చేసిన టీడబ్ల్యూ ప్రధాన కార్యదర్శి ఎంఎం నాయక్
పాడేరు. జనవరి 1(ఆంధ్రజ్యోతి): గిరిజన సహకార సంస్థ (జీసీసీ) కాఫీ ప్రొక్యూర్‌మెంట్ అధికారిగా ఐటీడీఏ పీవో టి.శ్రీపూజను నియమిస్తూ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి ఎంఎం.నాయక్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జీసీసీ కాఫీ కొనుగోలుతో పాటు ఐటీడీఏ ఆధ్వర్యంలో చింతపల్లిలో నిర్వహిస్తున్న పల్పింగ్ యూనిట్ పని తీరును పర్యవేక్షించాలని, ప్రభుత్వం తరఫున కాఫీ అభివృద్ధి, కొనుగోలుకు సంబంధించిన అంశాలపై ప్రత్యేక ఫలితాలు సాధించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే జీసీసీ ఎండీ, కాఫీ ప్రొక్యూర్‌మెంట్ అధికారి సమన్వయంతో ఆయా లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. జీసీసీ ఎండీగా ఐఏఎస్ అధికారి పని చేస్తుండగా, కేవలం కాఫీ కొనుగోలు వ్యవహారాలను చూసుకునేందుకు మరో ఐఏఎస్ అధికారి అయిన ఐటీడీఏ పీవోను ప్రొక్యూర్‌మెంట్ అధికారిగా నియమించడం ఇదే ప్రప్రథమం.