ధింసా ప్రదర్శనను అవమానించడం సరికాదు
ABN , Publish Date - Aug 05 , 2026 | 01:01 AM
గిరిజనుల సంప్రదాయ ధింసా ప్రదర్శనతో గిరిజన బాలికలు దేశం గర్వించేలా గిన్నిస్ రికార్డు సాధిస్తే, దానిని పలువురు అవమానించడం సరికాదని జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్ అన్నారు. స్థానిక క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో ఆదివాసీల సంస్కృతి, ఆత్మగౌరవంగా భావించే ధింసా నృత్యంతో బాలికలు చక్కని ప్రదర్శన ఇచ్చి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందారన్నారు.
- జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్
- గిరిజన సంప్రదాయ నృత్యాన్ని అవహేళన చేయడంపై ఆవేదన
పాడేరు, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): గిరిజనుల సంప్రదాయ ధింసా ప్రదర్శనతో గిరిజన బాలికలు దేశం గర్వించేలా గిన్నిస్ రికార్డు సాధిస్తే, దానిని పలువురు అవమానించడం సరికాదని జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్ అన్నారు. స్థానిక క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో ఆదివాసీల సంస్కృతి, ఆత్మగౌరవంగా భావించే ధింసా నృత్యంతో బాలికలు చక్కని ప్రదర్శన ఇచ్చి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందారన్నారు. అయితే గిరిజన బాలికల ధింసా నృత్య ప్రదర్శనను విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్, తదితరులు విమర్శించడం తగదన్నారు. గిరిజనుల కళతో ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకువచ్చిన గిరిజన బాలికలను అవహేళన చేయడం ఎంత వరకు న్యాయమని శ్రావణ్‌కుమార్ ప్రశ్నించారు. బాలికల ప్రతిభకు, గిరిజన సంప్రదాయ నృత్యం ధింసాకు ప్రత్యేక గుర్తింపు లభించిన సందర్భంలో వారిని మెచ్చుకుని మరింతగా ప్రోత్సహించాల్సింది పోయి అవమానకరంగా మాట్లాడడం గిరిజన సమాజాన్ని అవమానించడమేనని ఆయన అన్నారు. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించడం, గిరిజనుల ధింసాకు ప్రపంచ ఖ్యాతి లభించడంపై అక్కసుతోనే పలువురు ఇలా తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఇకనైనా గిరిజనులు సాధించే విజయాలపై అవహేళనగా మాట్లాడవద్దని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ పర్సన్ ఇన్‌చార్జి ప్రసాద్, టీడీపీ నేతలు జ్ఞానప్రకాశ్, పాండురంగస్వామి, శశిభూషణ్‌నాయుడు, సాగర సుబ్బారావు, కళావతి, త్రినాథ్ పాల్గొన్నారు.