కాపులుప్పాడలో ఐటీ హబ్
ABN , Publish Date - Nov 26 , 2026 | 01:24 AM
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి పచ్చజెండా ఊపింది. వీటిలో కొన్ని సంస్థలు ఇటీవల విశాఖలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఎంఓయూలు చేసుకున్నవి కావడం విశేషం. బాల్వేడి సంస్థ అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం తూటిపాలలో హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది.
స్టా్ట్రటజిక్ గ్లోబల్ ఇన్నోవేషన్
అండ్ ఐటీ డెలివరీ సెంటర్ కూడా ఏర్పాటు
గుర్రంపాలెంలో లాజిస్టిక్స్ పార్క్
అనకాపల్లి జిల్లా తూటిపాలలో
హైపర్ స్కేల్ డేటా సెంటర్
ఉమ్మడి విశాఖ మరిన్ని పెట్టుబడులు
విశాఖపట్నం, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి):
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి పచ్చజెండా ఊపింది. వీటిలో కొన్ని సంస్థలు ఇటీవల విశాఖలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఎంఓయూలు చేసుకున్నవి కావడం విశేషం. బాల్వేడి సంస్థ అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం తూటిపాలలో హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. దీని సామర్థ్యం 720 మెగావాట్లు. పెట్టుబడి రూ.47,009 కోట్లు. అందులో రెండు వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అదే సంస్థ విశాఖపట్నంలోని కాపులుప్పాడలో 30 ఎకరాల విస్తీర్ణంలో ఐటీ/ఐటీఈఎస్ హబ్‌ను ఏర్పాటుచేస్తుంది. దీనికి పెట్టుబడి రూ.2,187 కోట్లు. దీని ద్వారా 27,600 మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొంది.
- ఇటీవల రిజిస్టర్ అయిన ఎంటీఎక్స్ ఇన్‌ఫ్రా కంపెనీ రూ.345 కోట్లతో కాపులుప్పాడలో స్టా్ట్రటజిక్ గ్లోబల్ ఇన్నోవేషన్ అండ్ ఐటీ డెలివరీ సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఇందులో రూ.345 కోట్ల పెట్టుబడి పెట్టి 3,201 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది.
- అవంతి వేర్ హౌసింగ్ సంస్థ పెందుర్తి మండలం గుర్రంపాలెంలో లాజిస్టిక్స్ పార్క్‌ను ఏర్పాటు చేయనుంది. రూ.142 కోట్ల పెట్టుబడితో 800 మందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తుంది.
- ఇప్పటికే అనకాపల్లి జిల్లాలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న సెయింట్ గోబిన్ రూ.1,800 కోట్లతో మరో ప్లాంటు ఏర్పాటు చేసి 500 మందికి ఉపాధి కల్పిస్తుంది. అదేవిధంగా ఏటీసీ టైర్ల కంపెనీ రూ.1,047.7 కోట్లతో 350 మందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తుంది.