Share News

కొత్త కొత్తగా ఉన్నది..

ABN , Publish Date - Nov 06 , 2026 | 01:16 AM

స్థానిక పురపాలక సంఘం నూతన పాలవర్గంలో అత్యధికులు కొత్త ముఖాలే కావడం విశేషం. మొత్తం 40 మంది కౌన్సిలర్లకుగాను 33 మంది తొలిసారి ఎన్నికైన వారే! ఏడుగురు మాత్రం రెండో దఫా కౌన్సిలర్లుగా అడుగుపెడుతున్నారు. వీరిలో గత పాలకవర్గంలో చైర్‌పర్సన్‌గా (అప్పట్లో వైసీపీ.. ప్రస్తుతం టీడీపీ) పనిచేసిన గుడబండి ఆధిలక్షి కూడా వున్నారు.

కొత్త కొత్తగా ఉన్నది..
నర్సీపట్నం టౌన్‌ వ్యూ

నర్సీపట్నంలో 33 మంది కౌన్సిలర్లు తొలిసారి ఎన్నిక

వీరిలో 28 మంది టీడీపీ వారే కావడం విశేషం

రెండోసారి అవకాశం వచ్చింది ఏడుగురికే!

నర్సీపట్నం, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): స్థానిక పురపాలక సంఘం నూతన పాలవర్గంలో అత్యధికులు కొత్త ముఖాలే కావడం విశేషం. మొత్తం 40 మంది కౌన్సిలర్లకుగాను 33 మంది తొలిసారి ఎన్నికైన వారే! ఏడుగురు మాత్రం రెండో దఫా కౌన్సిలర్లుగా అడుగుపెడుతున్నారు. వీరిలో గత పాలకవర్గంలో చైర్‌పర్సన్‌గా (అప్పట్లో వైసీపీ.. ప్రస్తుతం టీడీపీ) పనిచేసిన గుడబండి ఆధిలక్షి కూడా వున్నారు.

నర్సీపట్నం మునిసిపాలిటీలో 40 వార్డులు వుండగా.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం 34, జనసేన 3 వార్డుల్లో విజయం సాధించాయి. మరో రెండు వార్డుల్లో టీడీపీ-జనసేన బలపరిచిన ఇండిపెండెంట్‌ అభ్యర్థులు గెలుపొందారు.. వైసీపీ ఒక్క వార్డుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. టీడీపీ కౌన్సిలర్లలో 28 మంది, జనసేకు చెందిన ఇద్దరితోపాటు మరో ఇద్దరు ఇండిపెండెంట్లు, ఒక వైసీపీ కౌన్సిలర్‌ తొలిసారి కౌన్సిల్‌ హాలులోకి అడుగుపెట్టనున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి లాలం మురళీ (1వ వార్డు), చిటికెల లోవమణి (2వ వార్డు), రుత్తల లక్ష్మి (3వ వార్డు), ముక్కి సుజాత (4వ వార్డు), మామిడి చిలకమ్మ (5వ వార్డు), గెడ్డం రమణ (6వ వార్డు), కురచా రమణమ్మ (12వ వార్డు), బోళెం దొరబాబు (14వ వార్డు), చల్లా పోతురాజు (15వ వార్డు), గుడివాడ రామలక్ష్మి (16వ వార్డు), యాదగిరి రామదాసు (17వ వార్డు), రెడ్డి లక్ష్మి (19వ వార్డు),, కామిరెడ్డి శ్రీనివాసరావు (20వ వార్డు), కొల్లి శివకుమార్‌ (21వ వార్డు), అంకంరెడ్డి కార్తికేయ (22వ వార్డు), బేతా దుర్గాదేవి (24వ వార్డు), గవిరెడ్డి పీడీవీ లక్ష్మి గణేశ్‌ (25వ వార్డు), బైపురెడ్డి సత్తిబాబు (26వ వార్డు), మురుకుర్తి రమణ (27వ వార్డు), పంటగొలుసు అప్పలరాజు (28వ వార్డు), జాలమూరి వెంకట రాజ్‌కుమార్‌ (30వ వార్డు), పెదిరెడ్ల చింతు (31వ వార్డు), గుడపర్తి గౌరీ వరలక్ష్మి (34వ వార్డు), సుతాపల్లి సుబ్బలక్ష్మి (36వ వార్డు), తమలపాకుల సౌమ్య (37వవార్డు), కొరుప్రోలు రాజ్యలక్ష్మి (38వ వార్డు), డబ్బీరు కరుణ (39వ వార్డు), గాలి రమణమ్మ (40వ వార్డు) మొదటిసారి కౌన్సిలర్లుగా గెలుపొందారు. జనసేన పార్టీకి చెందిన 8వ వార్డు కౌన్సిలర్‌ సురకాసుల గోపి, 18వ వార్డు కౌన్సిలర్‌ ఆదపురెడ్డి రామకృష్ణ మొదటిసారి ఎన్నికయ్యారు. స్వతంత్ర అభ్యర్థులు పంచాడ హరనాథ్‌ (11వ వార్డు), అడిగర్ల సతీశ్‌ (29వ వార్డు), వైసీపీకి చెందిన 7వ వార్డు కౌన్సిలర్‌ కరణం అమ్మాజీ కూడా మొదటిసారి ఎన్నికైనవారే!

ఇక రెండోసారి కౌన్సిలర్లుగా గెలిచిన వారి వివరాలను పరిశీలిస్తే.. 35వ వార్డు నుంచి టీడీపీ కౌన్సిలర్‌గా ఎన్నికైన పైల గోవింద్‌ 2014 ఎన్నికల్లో 27వ వార్డు నుంచి గెలిచారు. జనసేన పార్టీ తరుపున రెండోసారి కౌన్సిలర్‌గా గెలిచిన అద్దెపల్లి సౌజన్య (13వ వార్డు).. 2021లో ఎన్నికల్లో 9వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా గెలిచారు. 10వ వార్డు నుంచి టీడీపీ కౌన్సిలర్‌గా గెలిచిన రావాడ లక్ష్మి, 2021 ఎన్నికల్లో 7వ వార్డు నుంచి ప్రాతినిధ్యం వహించారు. 9వ వార్డు నుంచి టీడీపీ తరపున గెలిచిన గొలుసు సుమజ 2014లో 4వ వార్డుకి ప్రాతినిధ్యం వహించారు. 2021లో 17వ వార్డు నుంచి వైసీపీ తరపున కౌన్సిలర్‌ గెలిచి రెండున్నర సంవత్సరాలు చైర్‌పర్సన్‌ పదవి చేపట్టిన గుడబండి ఆదిలక్ష్మి, కొంతకాలం క్రితం టీడీపీలో చేరారు. తాజా ఎన్నికల్లో 23వ వార్డు కౌన్సిలర్‌గా గెలిచారు. 32వ వార్డు టీడీపీ కౌన్సిలర్‌గా గెలిచిన ధనిమిరెడ్డి మధుబాబు గత పాలవర్గంలో 24వ వార్డుకి ప్రాతినిధ్యం వహించారు. 33వ వార్డు టీడీపీ కౌన్సిలర్‌గా విజయం సాధించిన నేరేళ్ల సీతాచంద్రిక, గత పాలకవర్గంలో 23 వార్డు కౌన్సిలర్‌గా పని చేశారు.

Updated Date - Nov 06 , 2026 | 01:16 AM