ఈసారి వర్రీ తప్పదా?
ABN , Publish Date - Sep 19 , 2026 | 12:33 AM
జిల్లాలో ఖరీఫ్ వరి సాగు వర్షాభావ పరిస్థితులతో గణనీయంగా తగ్గిపోయింది. సాధారణంగా ఖరీఫ్ సీజన్‌లో 56,329 హెక్టార్లలో వరి సాగు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 19,370 హెక్టార్లలో మాత్రమే సాగు అయింది. అంటే సాధారణ విస్తీర్ణంలో కేవలం 34.38 శాతం మాత్రమే వరి సాగులోకి వచ్చింది. వర్షాలు సకాలంలో కురవకపోవడంతో చెరువులు, కాలువలు, రిజర్వాయర్లపై ఆధారపడే ప్రాంతాల్లో నాట్లు ఆలస్యమయ్యాయి. బోర్లు, ఇతర ప్రత్యామ్నాయ నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో మాత్రమే కొంతమేర సాగు కొనసాగుతోంది.
- ఖరీఫ్‌లో తగ్గిపోయిన వరి సాగు
- సాధారణ సాగు విస్తీర్ణం 56,329 హెక్టార్లు కాగా, ఇప్పటి వరకు 19,370 హెక్టార్లకే పరిమితం
- జిల్లాలో వర్షాభావ పరిస్థితులే కారణం
(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)
జిల్లాలో ఖరీఫ్ వరి సాగు వర్షాభావ పరిస్థితులతో గణనీయంగా తగ్గిపోయింది. సాధారణంగా ఖరీఫ్ సీజన్‌లో 56,329 హెక్టార్లలో వరి సాగు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 19,370 హెక్టార్లలో మాత్రమే సాగు అయింది. అంటే సాధారణ విస్తీర్ణంలో కేవలం 34.38 శాతం మాత్రమే వరి సాగులోకి వచ్చింది. వర్షాలు సకాలంలో కురవకపోవడంతో చెరువులు, కాలువలు, రిజర్వాయర్లపై ఆధారపడే ప్రాంతాల్లో నాట్లు ఆలస్యమయ్యాయి. బోర్లు, ఇతర ప్రత్యామ్నాయ నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో మాత్రమే కొంతమేర సాగు కొనసాగుతోంది.
జిల్లాలో ఈ ఏడాది జూన్ 1 నుంచి సెప్టెంబరు 16 వరకు సాధారణ వర్షపాతం 57.1 సెంటీమీటర్లు కురవాల్సి ఉండగా, కేవలం 31.1 సెంటీమీటర్లు మాత్రమే వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఖరీఫ్ పంటలపై ప్రభావం చూపింది. ముఖ్యంగా నీటి అవసరం అధికంగా ఉండే వరి సాగు విస్తీర్ణం తగ్గడానికి ప్రధాన కారణం వర్షాభావ పరిస్థితులేనని రైతులు పేర్కొంటున్నారు.
వరి నాట్లు అంతంతే...
జిల్లాలో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న వరి రైతులు ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ముగిసే సమయం ఆసన్నమవుతున్నా పూర్తిస్థాయిలో నాట్లు పూర్తి చేయలేకపోయారు. వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో నాతవరం మండలంలో 5,362 హెక్టార్లలో అత్యధికంగా వరి సాగు అవుతోంది. ఇక్కడ సాధారణ విస్తీర్ణం 6,297 హెక్టార్లు కాగా, 85 శాతం నాట్లు పూర్తయ్యాయి. వి.మాడుగులలో 3,829 హెక్టార్లు (84.45 శాతం), చోడవరంలో 1,017 హెక్టార్లు (35.88 శాతం), రావికమతంలో 843 హెక్టార్లు (33.86 శాతం), కె.కోటపాడులో 784 హెక్టార్లు (32.42 శాతం), బుచ్చెయ్యపేటలో 272 హెక్టార్లు (30.1 శాతం) వరి నాట్లు పూర్తయ్యాయి.
నీటి లభ్యత లేని ప్రాంతాల్లో...
జిల్లాలో నీటి లభ్యత లేని ప్రాంతాల్లో వరి సాగు ఆశించిన స్థాయిలో జరిగేలా లేదు. రోలుగుంటలో సాధారణ విస్తీర్ణం 1,779 హెక్టార్లకు కేవలం 25 హెక్టార్లలోనే (1.4 శాతం) వరి సాగు అవుతోంది. రాంబిల్లిలో 59 హెక్టార్లు (2.86 శాతం), నక్కపల్లిలో 65 హెక్టార్లు (3.63 శాతం), ఎస్.రాయవరంలో 183 హెక్టార్లు (5.24 శాతం), ఎలమంచిలి 177 హెక్టార్లు మాత్రమే (8.25 శాతం) వరి నాట్లు పడ్డాయి.
జిల్లాలో మండలాల వారీగా వరి నాట్లు (హెక్టార్లలో..)
మండలం సాధారణం నాట్లు వేసినవి శాతం
--------------------------------------------------------------
నక్కపల్లి 1,790 65 3.63
ఎస్.రాయవరం 3,490 183 5.24
రాంబిల్లి 2,062 59 2.86
ఎలమంచిలి 2,144 177 8.25
రోలుగుంట 1,779 25 1.40
పాయకరావుపేట 2,600 240 9.23
చీడికాడ 3,030 394 13
కోటవురట్ల 1,845 284 15.39
గొలుగొండ 1,418 189 13.32
నర్సీపట్నం 2,443 350 14.32
అనకాపల్లి 2,624 597 22.75
కశింకోట 1,187 112 9.43
సబ్బవరం 1,409 162 11.49
మాకవరపాలెం 1,538 392 25.48
బుచ్చెయ్యపేట 2,415 727 30.1
కె.కోటపాడు 2,418 784 32.42
అచ్యుతాపురం 727 137 18.84
చోడవరం 2,834 1,017 35.88
రావికమతం 2,489 843 33.86
పరవాడ 141 76 53.9
మునగపాక 1,529 401 26.22
దేవరాపల్లి 3,586 2,975 82.96
వి.మాడుగుల 4,534 3,829 84.45
నాతవరం 6,297 5,352 84.99
-------------------------------------------------------------
మొత్తం 56,329 19,370 34.38
--------------------------------------------------------------