అసంపూర్తి భవనాల పరిస్థితి ఇంతేనా?
ABN , Publish Date - Jan 14 , 2026 | 12:09 AM
జీకేవీధి మండలం గాలికొండలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైన రైతు భరోసా కేంద్రం(ఆర్బీకే), హెల్త్ సబ్‌సెంటర్ భవనాలు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆర్బీకే, హెల్త్ సబ్ సెంటర్ భవన నిర్మాణాలు ప్రారంభం
బిల్లులు చెల్లించకపోవడంతో పనులు నిలిపివేసిన కాంట్రాక్టర్
గత మూడేళ్లుగా కదలని పనులు
సీలేరు, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): జీకేవీధి మండలం గాలికొండలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైన రైతు భరోసా కేంద్రం(ఆర్బీకే), హెల్త్ సబ్‌సెంటర్ భవనాలు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. గత ప్రభుత్వం కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. జీకేవీధి మండలం గాలికొండలో గత ప్రభుత్వం ఆర్భాటంగా రైతు భరోసా కేంద్రం, హెల్త్ సబ్ సెంటర్ భవన నిర్మాణాలను ప్రారంభించింది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ పునాదులు వేసి పిల్లర్ల వరకు నిర్మించారు. అయితే వాటికి బిల్లులను గత ప్రభుత్వం మంజూరు చేయకపోవడంతో ఎక్కడికక్కడ పనులను నిలిపివేశారు. గత మూడు సంవత్సరాలుగా ఈ సంపూర్తి నిర్మాణాల చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. కూటమి ప్రభుత్వమైనా ఈ నిర్మాణాలను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని గాలికొండ సర్పంచ్ బుజ్జిబాబు, గ్రామస్థులు కోరుతున్నారు,