జిల్లాకు మళ్లీ పెట్టుబడులు
ABN , Publish Date - Nov 14 , 2026 | 01:13 AM
పారిశ్రామిక ప్రగతిలో అనకాపల్లి జిల్లా మరో మైలురాయిని దాటింది. విశాఖపట్నంలో నిర్వహిస్తున్న సీఐఐ పెట్టుబడుల భాగస్వామ్య సదస్సులో వివిధ రంగాలకు చెందిన ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ సంస్థలు అనకాపల్లి జిల్లాలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) కుదుర్చుకున్నాయి.
సీఐఐ భాగస్వామ్య సదస్సులో దిగ్గజ కంపెనీలతో ఎంఓయూలు
హెల్త్, సోలార్, గ్లాస్, స్టీల్ రంగాల్లో పరిశ్రమలు ఏర్పాటు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
పారిశ్రామిక ప్రగతిలో అనకాపల్లి జిల్లా మరో మైలురాయిని దాటింది. విశాఖపట్నంలో నిర్వహిస్తున్న సీఐఐ పెట్టుబడుల భాగస్వామ్య సదస్సులో వివిధ రంగాలకు చెందిన ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ సంస్థలు అనకాపల్లి జిల్లాలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) కుదుర్చుకున్నాయి. ఇందులో ప్రధానమనది రెన్యూ ఎనర్జీ కంపెనీ. పాలీ సిలికాన్, సోలార్ రంగానికి చెందిన రెన్యూ ఫొటో ఓల్టాయిక్స్ ప్రైవేటు లిమిటెడ్ అత్యధికంగా రూ.8,500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. గ్లాస్ తయారీ దిగ్గజం సెయింట్ గోబైన్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ రూ.1,750 కోట్లు, ఫైజర్ హెల్త్‌కేర్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ రూ.983 కోట్లు, బ్లూజెట్ హెల్త్‌కేర్ లిమిటెడ్ రూ.500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నాయి. ఇంకా రాంబిల్లిలో రూ.1,500 కోట్లతో శాశ్వత ఆయస్కాంతాల (పర్మనెంట్ మాగ్నెట్) తయారీ పరిశ్రమ నెలకొల్పనున్నారు. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ, ఎలకా్ట్రనిక్స్, సెమీకండక్టర్ అనుబంధ పరిశ్రమలకు మరింత ఊతం అభించనుంది. హెచ్‌టీఎల్ మెటల్ ప్రైవేటు లిమిటెడ్ రూ.500 కోట్లు, ఎస్‌ఎస్‌ఎస్ వైర్స్ అండ్ కేబుల్స్ ప్రైవేటు లిమిటెడ్ రూ.120 కోట్లు, బీకే స్టీల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ.115 కోట్లు, వివాన్ స్ట్రక్టోటెక్ ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిట్‌డ రూ.1.5.50 కోట్లు, దేవేంద్ర లెదర్ కంఫర్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ రూ.50 కోట్లు, రిహాబ్ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ రూ.45 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఎంఓయూలపై సంతకాలు చేశాయి.