అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్టు
ABN , Publish Date - May 17 , 2026 | 12:29 AM
అంతర్ జిల్లా దొంగల ముఠాను అరెస్టు చేసినట్టు ఎస్పీ తుహిన్‌సిన్హా తెలిపారు. ఇటీవల మునగపాక మండలం వెంకటాపురం గ్రామంలో జరిగిన చోరీకి సంబంధించిన వివరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. ఈ నెల రెండో తేదీన మునగపాకలోని వెంకటాపురం గ్రామంలో ఒక ఇంట్లో చోరీ జరిగింది.
- ముగ్గురు నిందితుల నుంచి రూ.66 లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులు స్వాధీనం
- ఎస్పీ తుహిన్‌సిన్హా
అనకాపల్లి రూరల్/రాంబిల్లి, మే 16 (ఆంధ్రజ్యోతి): అంతర్ జిల్లా దొంగల ముఠాను అరెస్టు చేసినట్టు ఎస్పీ తుహిన్‌సిన్హా తెలిపారు. ఇటీవల మునగపాక మండలం వెంకటాపురం గ్రామంలో జరిగిన చోరీకి సంబంధించిన వివరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. ఈ నెల రెండో తేదీన మునగపాకలోని వెంకటాపురం గ్రామంలో ఒక ఇంట్లో చోరీ జరిగింది. మునగపాక ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు శనివారం అనకాపల్లి బైపాస్ రోడ్డులో లక్ష్మీపురం బస్టాప్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీల్లో వివిఽధ జిల్లాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు మోస్ట్ వాంటెడ్ అంతర్ జిల్లా దొంగలు ఒకే బైక్‌పై వస్తుండగా మునగపాక పోలీసులు పట్టుకున్నారు. నిందితుల్లో పాచిలవానిపాలేనికి చెందిన దొంగలి ప్రకాశ్, సిరికి విజయకుమార్, విశాఖపట్నానికి చెందిన ఈర్ల వినయ్‌కుమార్ ఉన్నారు. పోలీసులు వారిని విచారించగా మునగపాక మండలం వెంకటాపురం గ్రామంలో చోరీ చేసినట్టు అంగీకరించారు. వారి నుంచి సుమారు రూ.66 లక్షల విలువ చేసే 450 గ్రాముల బంగారు ఆభరణాలు, 250 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్టు ఎస్పీ తెలిపారు.