Share News

ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

ABN , Publish Date - Feb 07 , 2026 | 11:08 PM

మండలంలోని గుమ్మకోట పంచాయతీ పూతికవలసలో ఇంటర్‌ విద్యార్థిని పాడి రాములమ్మ (16) శుక్రవారం జీడితోటలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య పాల్పడింది.

ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

అనంతగిరి, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గుమ్మకోట పంచాయతీ పూతికవలసలో ఇంటర్‌ విద్యార్థిని పాడి రాములమ్మ (16) శుక్రవారం జీడితోటలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య పాల్పడింది. ఎస్‌ఐ కె.శంకరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

మండలంలోని గుమ్మకోట పంచాయతీ పూతికవలసకు చెందిన పాడి రాములమ్మ ఎస్‌.కోట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతోంది. గత మూడు రోజులుగా జరుగుతున్న ప్రాక్టికల్స్‌ ఆమె హాజరు కాలేదు. అలాగే పబ్లిక్‌ పరీక్షలు కూడా సమీపిస్తున్న నేపథ్యంలో భయోందోళనకు గురైంది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. జీడితోట వద్ద బాలిక ఉరివేసుకుని ఉండడాన్ని స్థానికులు చూసి, కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలాన్ని ఎస్‌ఐ కె.శంకరరావు పరిశీలించారు. ఎస్‌.కోట ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Feb 07 , 2026 | 11:08 PM