నేటి నుంచే ఇంటర్ పరీక్షలు
ABN , Publish Date - Feb 23 , 2026 | 12:40 AM
టర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 34 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు వేర్వేరుగా మార్చి 24వ తేదీ వరకు నిర్ణీత తేదీల్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులను 30 నిమిషాల ముందు నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. సరిగ్గా తొమ్మిది గంటలకు గేట్లు మూసేస్తారు.
34 కేంద్రాలు, 26,301 మంది విద్యార్థులు
నిర్ణీత తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష
అర్ధ గంట ముందు నుంచే కేంద్రాల్లోకి ప్రవేశం
ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
అనకాపల్లి, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 34 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు వేర్వేరుగా మార్చి 24వ తేదీ వరకు నిర్ణీత తేదీల్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులను 30 నిమిషాల ముందు నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. సరిగ్గా తొమ్మిది గంటలకు గేట్లు మూసేస్తారు. ఒక్క నిమిషం ఆలస్యం అయినా లోపలికి అనుమతించరు. ఈ ఏడాది జిల్లాలో ప్రథమ, ద్వితీయ ఇంటర్ పరీక్షలకు 26,301 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో మొదటి సంవత్సరం విద్యార్థులు 13,153 మంది, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 13,148 మంది వున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించారు. కాపీయింగ్‌కు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో ప్రతి గదిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు సెల్‌ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, ఎలకా్ట్రనిక్ పరికరాలను వెంట తీసుకురాకూడదు.