ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
ABN , Publish Date - Feb 25 , 2026 | 01:22 AM
జిల్లాలో మంగళవారం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. అన్ని కేంద్రాల్లో ప్రశాంతంగా పరీక్ష జరిగినట్టు జిల్లా ఇంటర్యీడియట్ విద్యాశాఖాధికారి ఎస్.భీమశంకరరావు తెలిపారు. మొత్తం 16 కేంద్రాల్లో మంగళవారం జరిగిన పరీక్షకు జనరల్ విద్యార్థులు 3,533 మంది హాజరు కావాల్సి ఉండగా 3,455 మంది హాజరయ్యారని, 78 మంది గైర్హాజరయ్యారన్నారు.
విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న పోలీసులు
రెండో సంవత్సరం తొలి పరీక్షకు 4,127 మంది హాజరు
పాడేరురూరల్, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మంగళవారం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. అన్ని కేంద్రాల్లో ప్రశాంతంగా పరీక్ష జరిగినట్టు జిల్లా ఇంటర్యీడియట్ విద్యాశాఖాధికారి ఎస్.భీమశంకరరావు తెలిపారు. మొత్తం 16 కేంద్రాల్లో మంగళవారం జరిగిన పరీక్షకు జనరల్ విద్యార్థులు 3,533 మంది హాజరు కావాల్సి ఉండగా 3,455 మంది హాజరయ్యారని, 78 మంది గైర్హాజరయ్యారన్నారు. ఒకేషనల్ విద్యార్థులు 703 మందికి 672 మంది హాజరుకాగా 31 మంది గైర్హాజయ్యారన్నారు. కాగా భీమశంకరరావు పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని, సీఐ డి.దీనబందు పాడేరులో రెండు పరీక్ష కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసి తరువాతే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి పంపుతున్నారు.