నేటి నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు
ABN , Publish Date - May 21 , 2026 | 12:52 AM
ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 60 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేసినట్టు ఆర్‌ఐవో మురళీధర్ తెలిపారు.
మద్దిలపాలెం, మే 20 (ఆంధ్రజ్యోతి)
ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 60 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేసినట్టు ఆర్‌ఐవో మురళీధర్ తెలిపారు. పిఠాపురం కాలనీలోని జిల్లా ఇంటర్ బోర్డు కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరీక్షలు రాసే గదుల్లో సీసీ కెమెరాలు అమర్చినట్టు చెప్పారు. ప్రథమ సంవత్సరం నుంచి 28,361, ద్వితీయ సంవత్సరం నుంచి 17,193 మంది పరీక్షలకు హాజరవుతున్నారని పేర్కొన్నారు. జూన్ 2వ తేదీ వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్ష గదుల్లోకి ఇన్విజిలేటర్లు, సిబ్బంది, విద్యార్థులు ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, ఇతర ఎలక్ర్టానిక్ వస్తువులు తీసుకురాకూడదన్నారు. విద్యార్థులు అరగంట ముందే పరీక్షాకేంద్రాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు.