గన్నెల పీహెచ్‌సీలో పనుల పరిశీలన
ABN , Publish Date - Aug 21 , 2026 | 12:00 AM
గన్నెల పీహెచ్‌సీలో సంజీవని పైలట్ ప్రాజెక్టును ఈ నెలాఖరున ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించనున్న నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ గురువారం పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనుల వివరాలను టీడబ్ల్యూ డీఈఈ అభిషేక్, ఏడీఎంహెచ్‌వో డాక్టర్ ముర
సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ఐటీడీఏ పీవో
అరకులోయ, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): గన్నెల పీహెచ్‌సీలో సంజీవని పైలట్ ప్రాజెక్టును ఈ నెలాఖరున ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించనున్న నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ గురువారం పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనుల వివరాలను టీడబ్ల్యూ డీఈఈ అభిషేక్, ఏడీఎంహెచ్‌వో డాక్టర్ మురళీకృష్ణ, పీహెచ్‌సీ వైద్యులు డాక్టర్ నాయుడు, డాక్టర్ గౌరి ప్రియాంకలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి ప్రాంగణంలో పర్యటించి పలు సూచనలు చేశారు. సకాలంలో పనులు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.