క్షేత్రస్థాయిలో సర్ ప్రక్రియ పరిశీలన
ABN , Publish Date - Jun 18 , 2026 | 11:04 PM
ఓటరు జాబితాలను నవీకరించాలనే లక్ష్యంలో ఎన్నికల కమిషన్ ఉద్దేశించిన స్పెషల్ ఇన్‌టెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్) ప్రక్రియను కలెక్టర్ టి.నిషాంతి గురువారం స్వయంగా పరిశీలించారు.
ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు తెలుసుకున్న కలెక్టర్
పాడేరురూరల్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితాలను నవీకరించాలనే లక్ష్యంలో ఎన్నికల కమిషన్ ఉద్దేశించిన స్పెషల్ ఇన్‌టెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్) ప్రక్రియను కలెక్టర్ టి.నిషాంతి గురువారం స్వయంగా పరిశీలించారు. పాడేరు మండలంలోని సుండ్రుపుట్టు సచివాలయం పరిధిలో నిర్వహిస్తున్న ఓటర్ల సవరణ జాబితా డోర్ టు డోర్ సర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తహశీల్దార్ బి.శ్రీనివాసరావు, ఎన్నికల సిబ్బంది, బూత్‌స్థాయి అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను స్వయంగా పరిశీలించారు. ఎన్యుమరేషన్ ఫారాలను తనిఖీ చేసి ఓటర్ల వివరాలను అనుసంధానించిన ఛాయాచిత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రోజువారీగా జరుగుతున్న పని పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట డీపీవో కేపీ చంద్రశేఖరరావు, డిప్యూటీ ఎంపీడీవో ఆర్‌వీఎస్ రమేశ్, బీఎల్‌వోలు, సచివాలయ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.