Share News

మునిసిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ కేంద్రం పరిశీలన

ABN , Publish Date - Oct 25 , 2026 | 12:48 AM

ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణ పక్కాగా ఉండాలని అధికారులను కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఆదేశించారు.

మునిసిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ కేంద్రం పరిశీలన
గురవప్ప కల్యాణ మండపంలో మునిసిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ విజయకృష్ణన్‌, తదితరులు

అధికారులకు కలెక్టర్‌ సూచన

ఎలమంచిలి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణ పక్కాగా ఉండాలని అధికారులను కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఆదేశించారు. పట్టణంలోని గురవప్పకల్యాణ మండపంలో మునిసిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ కేంద్రంలో ఏర్పాట్లను శనివారం ఆమె పరిశీలించారు. మునిసిపల్‌ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్‌ నుంచి కౌంటింగ్‌ వరకు ఈ కల్యాణ మండపంలో చేపడుతున్న ఏర్పాట్లను ఆమె పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. అలాగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ కేంద్రాలుగా ఉపయోగించుకునేందుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఇండోర్‌ స్టేడియాల్లో అన్ని వసతులు ఉన్నాయో?, లేదో ఆమె పరిశీలించారు. ఆమె వెంట డీఎస్పీ మోహనరావు, ఆర్డీవో కేవీ రామలక్ష్మి, తహశీల్దార్‌ కె.వరహాలు, కమిషనర్‌ ప్రసాదరాజు ఉన్నారు.

Updated Date - Oct 25 , 2026 | 12:48 AM