Share News

ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సుల తనిఖీ

ABN , Publish Date - Jul 19 , 2026 | 12:41 AM

జాతీయ రహదారిలోని పూడిమడకకు వెళ్లే జంక్షన్‌లో రవాణాశాఖ ఇన్‌స్పెక్టర్లు శనివారం తెల్లవారుజామున స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు.

ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సుల తనిఖీ
ట్రావెల్స్‌ బస్సు రికార్డులను పరిశీలిస్తున్న రవాణా శాఖ అధికారులు

రికార్డులు పరిశీలించిన రవాణా శాఖ అధికారులు

ఎనిమిది బస్సులకు రూ.70 వేల జరిమానా

అనకాపల్లి టౌన్‌, జూలై 18 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారిలోని పూడిమడకకు వెళ్లే జంక్షన్‌లో రవాణాశాఖ ఇన్‌స్పెక్టర్లు శనివారం తెల్లవారుజామున స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. జిల్లా రవాణాశాఖ అధికారి మనోహర్‌ ఆదేశాల మేరకు ఎంవీఐలు ప్రవీణ్‌కుమార్‌, అమృతగ్రేష్మి, సుల్తానాలు సిబ్బందితో 30 బస్సులను తనిఖీలు చేశారు. వీటిలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఎనిమిది బస్సులకు రూ.70 వేల వరకు జరిమానా విధించారు. ఆలిండియా టూరిస్టు బస్సులను కూడా తనిఖీ చేశారు. పలు బస్సుల్లో ప్రయాణికులతో పాటు సరుకుల రవాణా చేయడాన్ని గుర్తించి నిబంధనలకు విరుద్ధంగా రవాణా చేస్తున్నందుకు జరిమానా విధించామని ఎంవీఐ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. తెల్లవారుజాము ఐదు గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు వాహనాల తనిఖీ కొనసాగింది.

Updated Date - Jul 19 , 2026 | 12:41 AM