బందవీధి ఆశ్రమ పాఠశాల తనిఖీ
ABN , Publish Date - Jun 17 , 2026 | 11:55 PM
మండలంలోని బందవీధి బాలికల ఆశ్రమ పాఠశాలను కలెక్టర్ టి.నిషాంతి బుధవారం తనిఖీ చేశారు. తొలుత రికార్డులను పరిశీలించి టీచర్లు, విద్యార్థుల హాజరును పరిశీలించారు.
రికార్డులను పరిశీలించిన కలెక్టర్
జి.మాడుగుల, జూన్ 17(ఆంధ్రజ్యోతి): మండలంలోని బందవీధి బాలికల ఆశ్రమ పాఠశాలను కలెక్టర్ టి.నిషాంతి బుధవారం తనిఖీ చేశారు. తొలుత రికార్డులను పరిశీలించి టీచర్లు, విద్యార్థుల హాజరును పరిశీలించారు. టీచర్లు ప్రత్యేక శ్రద్ధతో విద్యార్థులకు బోధన చేయాలని, నాణ్యమైన ఆహారం అందించడంతో పాటు వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ కనబరచాలన్నారు. ఆశ్రమ పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఆశించిన స్థాయిలో బోధన సాఽగించి, చక్కని ఫలితాలు సాధించాలని హెచ్‌ఎం, టీచర్లను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పీబీకే.పరిమిళ, హెచ్‌ఎం, టీచర్లు పాల్గొన్నారు.