Share News

సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన

ABN , Publish Date - Aug 27 , 2026 | 12:29 AM

మండలంలోని గన్నెలకు ఈ నెల 29న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రానున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లను బుధవారం సాయంత్రం సీఎం ప్రోగ్రాం కో-ఆర్డినేటర్‌ వెంకటేశ్‌, కలెక్టర్‌ నిషాంతి, జేసీ శ్రీపూజ, జీసీసీ చైర్మన్‌ శ్రావణ్‌కుమార్‌, అధికారులు పరిశీలించారు.

సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి ప్రోగాం కో-ఆర్డినేటర్‌ వెంకటేశ్‌, కలెక్టర్‌ నిషాంతి, జేసీ శ్రీపూజ, జీసీసీ చైర్మన్‌ శ్రావణ్‌కుమార్‌, అధికారులు

అరకులోయ, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గన్నెలకు ఈ నెల 29న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రానున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లను బుధవారం సాయంత్రం సీఎం ప్రోగ్రాం కో-ఆర్డినేటర్‌ వెంకటేశ్‌, కలెక్టర్‌ నిషాంతి, జేసీ శ్రీపూజ, జీసీసీ చైర్మన్‌ శ్రావణ్‌కుమార్‌, అధికారులు పరిశీలించారు. హెలీప్యాడ్‌, సభాస్థలి, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించే స్థలం, సంజీవని పైలట్‌ ప్రాజెక్టును ప్రారంభించే గన్నెల పీహెచ్‌సీని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం ప్రోగ్రాం కో-ఆర్డినేటర్‌ వెంకటేశ్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం అయ్యేలా చూడాలని, ఎటువంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. పనులను వెంటనే పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బీ, పీఆర్‌, విద్యుత్‌ శాఖ, టీడబ్ల్యూ, ఆర్‌డబ్ల్యూఎస్‌, వైద్య,ఆరోగ్యశాఖల అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.

చురుగ్గా పనులు

సీఎం పర్యటన నేపథ్యంలో పనులు చురుగ్గా సాగుతున్నాయి. గన్నెల సమీపంలో హెలీప్యాడ్‌ పనులు ఆర్‌అండ్‌బీ శాఖ ఈఈ సాగర్‌, డీఈఈ వెంకటరామన్న, ఏఈఈ రూబెన్‌ పర్యవేక్షణలో జరుగుతున్నాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలతో సీఎ సమావేశమయ్యే స్థలాన్ని చదును చేసే పనులను పీఆర్‌ ఈఈ పడాల్‌, డీఈఈ రామం పర్యవేక్షిస్తున్నారు. సభా వేదికను టీడబ్ల్యూ ఈఈ వేణుగోపాల్‌, డీఈఈ అభిషేక్‌ పర్యవేక్షణలో సిద్ధం చేస్తున్నారు.

Updated Date - Aug 27 , 2026 | 12:29 AM