చంద్రబాబు సమర్థతతో పరిశ్రమలు
ABN , Publish Date - May 11 , 2026 | 12:40 AM
అనకాపల్లి జిల్లా పారిశ్రామికంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుదీర్ఘ పాలన అనుభవం, సమర్థతతో రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు చెప్పారు. మండలంలోని వడ్డాదిలో ఆదివారం చోడవరం నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి పీవీఎస్‌ఎన్ రాజు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిఽధి ఈర్లె రామ్మూర్తిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో కూటమిలోని మూడు పార్టీలు సమన్వయంతో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు చెప్పారు.
జిల్లాలో పెట్టుబడులకు ముందుకు వస్తున్న పారిశ్రామికవేత్తలు
రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్ బత్తుల తాతయ్యబాబు
బుచ్చెయ్యపేట, మే 10 (ఆంధ్ర జ్యోతి): అనకాపల్లి జిల్లా పారిశ్రామికంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుదీర్ఘ పాలన అనుభవం, సమర్థతతో రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు చెప్పారు. మండలంలోని వడ్డాదిలో ఆదివారం చోడవరం నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి పీవీఎస్‌ఎన్ రాజు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిఽధి ఈర్లె రామ్మూర్తిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో కూటమిలోని మూడు పార్టీలు సమన్వయంతో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు చెప్పారు.
గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి చెరకు సరఫరా చేసిన రైతులకు బకాయిలు చెల్లించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. జనసేన ఇన్‌చార్జి పీవీఎస్‌ఎన్ రాజు మాట్లాడుతూ, జిల్లా రవాణా వ్యవస్థలో ఎంతో కీలకమైన బీఎన్ రోడ్డు నిర్మాణ పనులు మరో నాలుగు నెలలో పూర్తవుతాయని చెప్పారు. ఇటీవల నాలుగు రాష్ట్రాలు, పుదుచ్చేరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి మూడుచోట్ల విజయం సాధించడం గొప్ప విషయమని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో ఆటవిక పాలనకు ప్రజలు చరమగీతం పాడి, బీజేపీని గెలిపించడం సంతోషం కలిగిస్తున్నదన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుతో బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు ఆగిపోతాయని ఆయన అన్నారు. బీజేపీ రాష్ట్ర నేత ఈర్లె రామ్మూర్తి మాట్లాడుతూ, చోడవరం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కూటమి నేతలు సమన్వయంతో పని చేస్తున్నారని అన్నారు.