Share News

మాకవరపాలేనికి పరిశ్రమలు క్యూ

ABN , Publish Date - Sep 12 , 2026 | 12:57 AM

మండలంలోని రాచపల్లి రెవెన్యూ 737 సర్వే నంబరులో ఉన్న భూములను శుక్రవారం ఏపీఐఐసీ, రెవెన్యూ అధికారులతో కలిసి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కంపెనీ ప్రతినిధులు పరిశీలించారు. కంపెనీ ఏర్పాటుకు 150 నుంచి 200 ఎకరాలు అవసరమని వారు చెప్పినట్టు స్ధానిక రెవెన్యూ అధికారులు తెలిపారు.

మాకవరపాలేనికి పరిశ్రమలు క్యూ
రాచపల్లిలో భూములను పరిశీలిస్తున్న ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కంపెనీ ప్రతినిధులు, అధికారులు

రాచపల్లిలో భూములను పరిశీలించిన ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కంపెనీ ప్రతినిధులు

150-200 ఎకరాలు అవసరమని అధికారులకు ప్రతిపాదన

మాకవరపాలెం, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): మండలంలోని రాచపల్లి రెవెన్యూ 737 సర్వే నంబరులో ఉన్న భూములను శుక్రవారం ఏపీఐఐసీ, రెవెన్యూ అధికారులతో కలిసి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కంపెనీ ప్రతినిధులు పరిశీలించారు. కంపెనీ ఏర్పాటుకు 150 నుంచి 200 ఎకరాలు అవసరమని వారు చెప్పినట్టు స్ధానిక రెవెన్యూ అధికారులు తెలిపారు.

మండలంలోని రాచపల్లి రెవెన్యూ 737 సర్వే నంబరులో 406 ఎకరాల కొండపోరంబోకు భూమిని కొద్ది నెలల క్రితం ప్రభుత్వం తీసుకుంది. వాస్తవంగా ఇది ప్రభుత్వ భూమి అయినప్పటికీ స్థానిక పేద రైతులు చాలా ఏళ్ల నుంచి సాగు చేసుకుంటుండడంతో ఎకరాకు రూ.9 లక్షల చొప్పున పరిహారాన్ని అందజేసింది. పరిశ్రమలకు కేటాయించే ఈ భూములకు జాతీయ రహదారితో అనుసంధానం చేయడానికి ఎరకన్నపాలెం మీదుగా ఎలమంచిలి దరి పెదపల్లి వరకు వంద అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరు చేసింది. కాగా రాచపల్లి రెవెన్యూ 737 సర్వే నంబరులో 150 ఎకరాలను ఇప్పటికే డోజ్కో కంపెనీకి కేటాయించింది. ఎంఎస్‌ఎంఈ పార్కుకు 24 ఎకరాలు కేటాయించింది. ఇంకా 232 ఎకరాలు వుంది. ఈ భూమిని శుక్రవారం ఏపీఐఐసీ, రెవెన్యూ అధికారులతో కలిసి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కంపెనీ ప్రతినిధులు పరిశీలించారు. తమకు 150 నుంచి 200 ఎకరాల వరకు అవసరమని ఈ సందర్భంగా వారు అధికారులకు చెప్పినట్టు తెలిసింది. ఈ పర్యటనలో తహశీల్దార్‌ కాకర నూకరాజు, మండల సర్వేర్లు, ఏపీఐఐసీ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 12 , 2026 | 12:57 AM