పేదరిక నిర్మూలనలో పరిశ్రమలు భాగస్వామ్యం కావాలి
ABN , Publish Date - May 20 , 2026 | 12:01 AM
పేదరిక నిర్మూలనలో పరిశ్రమల యాజమాన్యాలు భాగస్వాములు కావాలని కలెక్టర్ విజయకృష్ణన్ పేర్కొన్నారు.
కలెక్టర్ విజయకృష్ణన్
అనకాపల్లి కలెక్టరేట్, మే 19 (ఆంధ్రజ్యోతి): పేదరిక నిర్మూలనలో పరిశ్రమల యాజమాన్యాలు భాగస్వాములు కావాలని కలెక్టర్ విజయకృష్ణన్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో వివిధ కంపెనీల యాజమాన్యాలతో జరిగిన ‘స్వర్ణాంధ్ర విజన్ ఎట్ ది రేట్ ఆఫ్ 2047’ సదస్సులో ఆమె మాట్లాడుతూ, పరిశ్రమల నిర్వాహకులు ఏదైనా ఒక గ్రామాన్ని లేదా మండలాన్ని దత్తత తీసుకొని ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, ప్రజల ఆర్థికాభివృద్ధికి అండగా నిలవాలని సూచించారు. స్వర్ణాంధ్ర పీ-4 ఫౌండేషన్‌కు విరివిగా విరాళాలు ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. స్వర్ణాంధ్ర పీ-4 ఫౌండేషన్ స్టేట్ డైరెక్టర్ సాంబశివరావు మాట్లాడుతూ, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రభుత్వం రూపొందించిన స్వర్ణాంధ్రప్రదేశ్ ట్రాన్స్‌ఫర్‌మేషన్ విజన్ సాధనలో పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యం కీలకమన్నారు. సమావేశంలో సీపీవో రామారావు, తదితరులు పాల్గొన్నారు.