పెరిగిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు
ABN , Publish Date - Mar 13 , 2026 | 10:53 PM
మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగాయి. కానీ పొగమంచు మాత్రం పూర్తిగా తగ్గుముఖం పట్టలేదు. తెల్లవారుజాము నుంచి ఉదయం ఏడు గంటల వరకు శీతాకాల వాతావరణాన్ని తలపించేలా దట్టంగా పొగమంచు కురుస్తోంది.
తగ్గని పొగమంచు
అరకులోయలో 13.5 డిగ్రీలు
పాడేరు, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగాయి. కానీ పొగమంచు మాత్రం పూర్తిగా తగ్గుముఖం పట్టలేదు. తెల్లవారుజాము నుంచి ఉదయం ఏడు గంటల వరకు శీతాకాల వాతావరణాన్ని తలపించేలా దట్టంగా పొగమంచు కురుస్తోంది. దీంతో శుక్రవారం వాహనదారులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు. అలాగే ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం మూడు గంటల వరకు మాత్రం ఎండ తీవ్రంగానే కాస్తున్నది. కాని రాత్రి వేళల్లో ఒక మోస్తరు చలి వేస్తున్నది. ఏజెన్సీలో శుక్రవారం అరకులోయలో 13.5 డిగ్రీల సెల్సియస్‌గా కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా ముంచంగిపుట్టులో 14.2, పెదబయలులో 14.9, చింతపల్ల్లిలో 15.2, జి.మాడుగులలో 17.3, కొయ్యూరులో 18.2, అనంతగిరిలో 22.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.