Share News

పెరిగిన అల్లం ధర

ABN , Publish Date - Jun 20 , 2026 | 11:21 PM

హుకుంపేటలో శనివారం జరిగిన సంతలో అల్లం ధర పెరిగింది. ఈ సీజన్‌ ప్రారంభంలో అల్లం కిలో రూ.70లకు వ్యాపారులు కొనుగోలు చేశారు. ఈ వారం దేశవాళీ అల్లం కిలో రూ.85 నుంచి రూ.90 వ్యాపారులు కొనుగోలు చేశారు.

పెరిగిన అల్లం ధర
హుకుంపేటలో సంతలోని కొనుగోలు చేసిన అల్లం

దేశవాళీ రూ.85 నుంచి రూ.90, హైబ్రిడ్‌ రూ.100 నుంచి రూ.110

ఆనందం వ్యక్తం చేస్తున్న గిరిజన రైతులు

హుకుంపేట, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): హుకుంపేటలో శనివారం జరిగిన సంతలో అల్లం ధర పెరిగింది. ఈ సీజన్‌ ప్రారంభంలో అల్లం కిలో రూ.70లకు వ్యాపారులు కొనుగోలు చేశారు. ఈ వారం దేశవాళీ అల్లం కిలో రూ.85 నుంచి రూ.90 వ్యాపారులు కొనుగోలు చేశారు. హైబ్రిడ్‌ రూ.100 నుంచి రూ.110 వరకు కొనుగోలు చేయడంతో గిరిజన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే ధరలు ఉంటే మంచి ఆదాయం వస్తుందని రైతులు అంటున్నారు. గత ఏడాది ఇదే సమయంలో కిలో అల్లం ధర రూ.25 నుంచి రూ.30 ఉండేది. ఈ ఏడాది ధర పలకడంతో గిరిజన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jun 20 , 2026 | 11:21 PM