ఎకో పార్కు ప్రారంభం
ABN , Publish Date - Jul 02 , 2026 | 01:02 AM
మండలంలోని మర్ధగుడ చాపరాయిని ఆనుకుని అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన ఎకో పార్కును బుధవారం వర్చువల్ విధానంలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ప్రారంభించారు.
వర్చువల్‌గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్
శిలా ఫలకాన్ని ఆవిష్కరించిన జేసీ శ్రీపూజ
అనంతగిరి, జూలై 1 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మర్ధగుడ చాపరాయిని ఆనుకుని అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన ఎకో పార్కును బుధవారం వర్చువల్ విధానంలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 నగర వనాలు, ఆరు ఎకో పార్కులను ప్రారంభించగా, దీనిలో భాగంగా ఇక్కడ పార్కును కూడా వర్చువల్‌గా ప్రారంభించారు. జాయింట్ కలెక్టర్ శ్రీపూజ, డీఎఫ్‌వో ఉమామహేశ్వరి, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరై శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేసీ శ్రీపూజ మాట్లాడుతూ ఎకో పార్కు ద్వారా వచ్చే ఆదాయాన్ని స్థానిక గిరిజనులకు ఉపాధి, అభివృద్ధికి ఖర్చుపెట్టనున్నామన్నారు. సీఎస్‌ఆర్ నిధులతో సింహాద్రి ఎన్టీపీసీ ఎకో పార్కును అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్మించడం అభినందనీయమన్నారు. డీఎఫ్‌వో ఉమామహేశ్వరి మాట్లాడుతూ ప్రకృతి అందాలను వీక్షిస్తూ పర్యాటకులు మంచి అనుభూతిని పొందనున్నారని చెప్పారు. 10 ఉడెన్ కాటేజీలతో పాటు రెస్టారెంట్ నిర్మాణ పనులను జరుగుతున్నాయని, స్థానిక గిరిజనులకు ఉపాధే లక్ష్యంగా ప్రాజెక్టు ఏర్పాటు చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సింహాద్రి ఎన్టీపీసీ ఈడీ అయస్కాంతజేనా, ఏజీఎం దయాశర్మ, డీజీఎం (ఈఎంజీ) శ్రీకృష్ణ, డీజీఎం (హెచ్‌ఆర్) శ్రీమంత మహాపాత్ర, అనంతగిరి ఇన్‌చార్జి రేంజర్ రాజాబాబు, ఎంపీపీ టి.మితుల, జడ్పీటీసీ సభ్యుడు గంగరాజు, మాజీ ఎంపీపీ నీలవేణి, టీడీపీ, జనసేన నాయకులు సుబ్బారావు, మురళి, తదితరులు పాల్గొన్నారు.