నర్సీపట్నంలో 72.6% పోలింగ్
ABN , Publish Date - Nov 02 , 2026 | 01:25 AM
స్థానిక మునిసిపల్ ఎన్నికలు ఆదివారం ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. మొత్తం 49,099 మంది ఓటర్లుకుగాను 35,647 మంది (72.6 శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు. పురుషులు 23,317 మందికిగాను 16,909 మంది (72.51 శాతం), మహిళలు 25,778 మందికిగాను 18,688 మంది (72.49 శాతం) ఓటు వేశారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఓటింగ్ చూసుకుంటే అత్యధికంగా 25 వార్డు రెండో పోలింగ్ కేంద్రంలో 755 ఓట్లుకి 725 ఓట్లు (96 శాతం) పోలయ్యాయి. అత్యల్పంగా 22వ వార్డు రెండో పోలింగ్ కేంద్రంలో 733 ఓట్లుకి 318 ఓట్లు (43.38 శాతం) ఓట్లు పోల్ అయ్యాయి.
మొత్తం ఓటర్లు: 49,099
పోలైన ఓట్లు: 35,647
పురుషులు 23,317 మందికిగాను 16,909 మంది, మహిళలు 25,778 మందికిగాను 18,688 మంది ఓటు
అత్యధికంగా 25వ వార్డు రెండో నంబరు పోలింగ్ బూత్‌లో 96 శాతం ఓటింగ్
అత్యల్పంగా 22వ వార్డు రెండో నంబరు బూత్‌లో 43.38 శాతం నమోదు
తొలుత మందకొడిగా పోలింగ్.. పది గంటల తరువాత ఊపందుకున్న ఓటింగ్
కుటుంబాలతో సహా ఓటు హక్కు వినియోగించుకున్న స్పీకర్ అయ్యన్న, ఎంపీ విజయ్, చైర్పర్సన్లు
నర్సీపట్నం, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి):
స్థానిక మునిసిపల్ ఎన్నికలు ఆదివారం ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. మొత్తం 49,099 మంది ఓటర్లుకుగాను 35,647 మంది (72.6 శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు. పురుషులు 23,317 మందికిగాను 16,909 మంది (72.51 శాతం), మహిళలు 25,778 మందికిగాను 18,688 మంది (72.49 శాతం) ఓటు వేశారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఓటింగ్ చూసుకుంటే అత్యధికంగా 25 వార్డు రెండో పోలింగ్ కేంద్రంలో 755 ఓట్లుకి 725 ఓట్లు (96 శాతం) పోలయ్యాయి. అత్యల్పంగా 22వ వార్డు రెండో పోలింగ్ కేంద్రంలో 733 ఓట్లుకి 318 ఓట్లు (43.38 శాతం) ఓట్లు పోల్ అయ్యాయి.
స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఎంపీ (రాజ్యసభ) విజయ్, టీడీపీ చైర్పర్సన్ అభ్యర్థి పద్మావతి, వారి కుటుంబ సభ్యులు, వైసీపీ అభ్యర్థి అనిత, కుటుంబ సభ్యులు ఐదు రోడ్లు జంక్షన్‌లోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే పెట్ల గణేశ్ పెదబొడ్డేపల్లి మెప్మా కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.
మునిసిపల్ చైర్పర్సన్ పదవికి టీడీపీ, వైసీపీతోపాటు మరో ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ చేశారు. మునిసిపాలిటీలో 40 వార్డులు వుండగా.. వీటిలో రెండు వార్డులు (26, 27) టీడీపీకి ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 38 వార్డు కౌన్సిలర్ పదవులకు ఆదివారం పోలింగ్ నిర్వహించారు. ఉదయం ఏడు గంటలు నుంచి 10 గంటల వరకు పోలింగ్ మందకొడిగా సాగింది. ఆ తరువాత నుంచి ఓటర్ల రాక పెరగడంతో పోలింగ్ సరళి ఊపందుకుంది. బ్యాలట్ విధానంలో పోలింగ్ జరగడంతో ఓటు వేయడానికి కొంతమేర ఎక్కువ సమయం పట్టింది.
వార్డులు, పోలింగ్ బూత్‌ల వారీగా ఓటింగ్ వివరాలు..
ఒకటో వార్డు ఒకలో నంబరు పోలింగ్ కేంద్రంలో 1,046 ఓట్లుకి 788 ఓట్లు (75.33 ు) పోలయ్యాయి. 2/1 కేంద్రంలో 1,011 ఓట్లుకి 762 (75.37ు), 3/1 కేంద్రంలో 625 ఓట్లుకి 454 (72.41ు), 3/2 కేంద్రంలో 627 ఓట్లుకి 479 (76.4ు), 4/1 కేంద్రంలో 540 ఓట్లుకి 339 (62.78ు), 4/2 కేంద్రంలో 541 ఓట్లుకి 389 (71.9ు), 5/1 కేంద్రంలో 588 ఓట్లుకి 434 (73.81ు), 5/2 కేంద్రంలో 588 ఓట్లుకి 448 (76.19ు) ఓట్లు పోలయ్యాయి.
ఆరో వార్డు ఒకటో నంబరు పోలింగ్ కేంద్రంలో 633 ఓట్లుకి 506 (79.94ు) ఓట్లు, 6/2 కేంద్రంలో 612 ఓట్లుకి 460 (75.16ు), 7/1 కేంద్రంలో 675 ఓట్లుకి 475 (70.37ు), 7/2 కేంద్రంలో 674 ఓట్లుకి 508 (75.37ు), 8/1 కేంద్రంలో 783 ఓట్లుకి 610 (77.91 ు), 8/2 కేంద్రంలో 780 ఓట్లుకి 630 (80.77 ు), 9/1 కేంద్రంలో 541 ఓట్లుకి 322 (59.52 ు), 9/2 కేంద్రంలో 541 ఓట్లుకి 352 (65.06 ు), 10/1 కేంద్రంలో 645 ఓట్లుకి 530 (82.17 ు), 10/2 కేంద్రంలో 645 ఓట్లుకి 531 (82.33 ు) ఓట్లు పోలయ్యాయి.
పదకొండో వార్డు ఒకటో నంబరు పోలింగ్ కేంద్రంలో 621 ఓట్లుకి 407 (65.54 ు) ఓట్లు, 11/2 కేంద్రంలో 587 ఓట్లుకి 390 (66.44 ు), 12/1 కేంద్రంలో 783 ఓట్లుకి 623 (79.57 ు), 12/2 కేంద్రంలో 792 ఓట్లుకి 548 (69.19 ు), 13/1 కేంద్రంలో 743 ఓట్లుకి 447 (60.16 ు), 13/2 కేంద్రంలో 742 ఓట్లుకి 504 (67.92 ు), 14/1 కేంద్రంలో 537 ఓట్లుకి 341 (63.50 ు), 14/2 కేంద్రంలో 530 ఓట్లుకి 360 (67.04 ు), 15/1 కేంద్రంలో 681 ఓట్లుకి 449 (65.93 ు), 15/2 పోలింగ్ కేంద్రంలో 680 ఓట్లుకి 496 (72.94 ు) ఓట్లు పడ్డాయి.
పదహారవ వార్డు ఒకటో నంబరు పోలింగ్ కేంద్రంలో 1,005 ఓట్లుకి 628 (62.79 ు), 17/1 కేంద్రంలో 540 ఓట్లుకి 624 (78.52 ు), 17/2 కేంద్రంలో 543 ఓట్లుకి 443 (82.04 ు), 18/1 కేంద్రంలో 621 ఓట్లుకి 515 (82.93 ు), 18/2 కేంద్రంలో 658 ఓట్లుకి 514 (78.12 ు), 19/1 కేంద్రంలో 712 ఓట్లుకి 644 (90.45 ు), 19/2 కేంద్రంలో 377 ఓట్లుకి 313 (83.02 ు), 20/1 కేంద్రంలో 567 ఓట్లుకి 483 (85.19 ు), 20/2 పోలింగ్ కేంద్రంలో 556 ఓట్లుకి 492 (88.49 ు) ఓట్లు పోలయ్యాయి.
ఇరవై ఒకటో వార్డు ఒకటో నంబరు పోలింగ్ కేంద్రంలో 540 ఓట్లుకి 399 (73.89 ు) ఓట్లు, 21/2 కేంద్రంలో 529 ఓట్లుకి 436 (82.42 ు), 22/1 కేంద్రంలో 532 ఓట్లుకి 381 (52.05 ు), 22/2 కేంద్రంలో 733 ఓట్లుకి 318 (43.38 ు), 23/1 కేంద్రంలో 918 ఓట్లుకి 399 (43.46 ు), 23/2 కేంద్రంలో 576 ఓట్లుకి 473 (82.12 ు), 24/1 కేంద్రంలో 695 ఓట్లుకి 596 (85.76 ు), 24/2 కేంద్రంలో 690 ఓట్లుకి 596 (86.38 ు), 25/1 కేంద్రంలో 755 ఓట్లుకి 662 (87.68 ు), 25/2 కేంద్రంలో 755 ఓట్లుకి 725 (96.03 ు) ఓట్లు పోలయ్యాయి.
ఇరవై ఆరో వార్డు ఒకటో నంబరు పోలింగ్ కేంద్రంలో 576 ఓట్లుకి 480 (83.33 ు), 26/2 కేంద్రంలో 583 ఓట్లుకి 511 (87.65 ు), 27/1 కేంద్రంలో 504 ఓట్లుకి 432 (85.71 ు), 27/2 కేంద్రంలో 632 ఓట్లుకి 577 (91.30 ు), 28/1 కేంద్రంలో 680 ఓట్లుకి 518 (76.18 ు), 28/2 కేంద్రంలో 254 ఓట్లుకి 229 (90.16 ు), 29/1 కేంద్రంలో 679 ఓట్లుకి 430 (63.33 ు), 29/2 కేంద్రంలో 352 ఓట్లుకి 297 (84.38 ు), 30/1 కేంద్రంలో 577 ఓట్లుకి 334 (57.89 ు), 30/2 కేంద్రంలో 577 ఓట్లుకి 282 (48.87 ు) ఓట్లు పోలయ్యాయి.
ముప్పైఒకటో వార్డు ఒకటో నంబరు పోలింగ్ కేంద్రంలో 721 ఓట్లుకి 469 (64.22 ు), 31/2 కేంద్రంలో 721 ఓట్లుకి 493 (68.38ు), 32/1 కేంద్రంలో 621 ఓట్లుకి 417 (67.15 ు), 32/2 కేంద్రంలో 626 ఓట్లుకి 378 (60.38ు), 33/1 కేంద్రంలో 582 ఓట్లుకి 456 (78.35 ు), 33/2 కేంద్రంలో 582 ఓట్లుకి 393 (67.53ు), 34/1 కేంద్రంలో 628 ఓట్లుకి 422 (67.2 ు), 34/2 కేంద్రంలో 510 ఓట్లుకి 397 (77.84ు), 35/1 కేంద్రంలో 691 ఓట్లుకి 479 (69.32 ు), 35/2 కేంద్రంలో 618 ఓట్లుకి 428 (69.26ు) ఓట్లు పోలయ్యాయి.
ముప్పై ఆరో వార్డు ఒకటో నంబరు పోలింగ్ కేంద్రంలో 605 ఓట్లుకి 387 (63.97ు), 36/2 కేంద్రంలో 606 ఓట్లుకి 395 (65.18ు), 37/1 కేంద్రంలో 621 ఓట్లుకి 447 (71.98ు), 37/2 కేంద్రంలో 602 ఓట్లుకి 442 (73.42ు), 38/1 కేంద్రంలో 756 ఓట్లుకి 541 (71.56ు), 38/2 కేంద్రంలో 726 ఓట్లుకి 482 (66.39ు), 39/1 కేంద్రంలో 595 ఓట్లుకి 395 (66.39 ు), 39/2 కేంద్రంలో 567 ఓట్లుకి 347 (61.2 ు), 40/1 పోలింగ్ కేంద్రంలో 1,008 ఓట్లుకి 772 (76.59ు) ఓట్లు పోలయ్యాయి.