Share News

గోవుల అక్రమ రవాణా

ABN , Publish Date - Sep 11 , 2026 | 12:41 AM

గోవులను అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం పాడేరు- హుకుంపేట మండలాల సరిహదు వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు.

గోవుల అక్రమ రవాణా
వాహనంలో తరలిస్తున్న ఆవులు

ముగ్గురి అరెస్టు

హుకుంపేట, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): గోవులను అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం పాడేరు- హుకుంపేట మండలాల సరిహదు వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో హకుంపేట వైపు నుంచి పాడేరు వైపు వెళుతున్న లారీని ఆపి తనిఖీ చేయగా లోపల ఆవులు కనిపించాయి. వీటి రవాణాకు సంబంధించి ఎటువంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో నిందితులను, లారీని అదుపులోకి తీసుకున్నారు. లారీలో మొత్తం 17 ఆవులు వున్నాయి. వీటిని రవాణా చేస్తున్న చింతపల్లికి చెందిన పిండి అప్పన్న, ఎలమంచిలికి చెందిన శ్రీను, నక్కపల్లికి చెందిన పీలా కొండలరావులను అరెస్టు చేశారు. గోవులను అడ్డతీగల మండలం గోలపాడు గ్రామంలోని గో సంరక్షణ కేంద్రానికి తరలించినట్టు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Sep 11 , 2026 | 12:41 AM