Share News

విశాఖకు ఐబీఎం

ABN , Publish Date - Apr 13 , 2026 | 01:02 AM

ప్రఖ్యాత ఐటీ సంస్థ ఐబీఎం విశాఖలో తమ కార్యాలయాన్ని అద్దె భవనంలో ఏర్పాటు చేసింది. ‘

విశాఖకు ఐబీఎం

ఇసుకతోట జంక్షన్‌లో అద్దె భవనంలో కార్యాలయం ఏర్పాటు

స్వాగతిస్తూ మంత్రి లోకేశ్‌ ట్వీట్‌

విశాఖపట్నం, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి):

ప్రఖ్యాత ఐటీ సంస్థ ఐబీఎం విశాఖలో తమ కార్యాలయాన్ని అద్దె భవనంలో ఏర్పాటు చేసింది. ‘సిటీ ఆఫ్‌ డెస్టినీ’గా పేరుగాంచిన విశాఖపట్నం.. ఇప్పుడు గ్లోబల్‌ ఐటీ హబ్‌గా అడుగులు వేస్తున్నది. ఇప్పటికే గూగుల్‌, ఇన్ఫోసిస్‌, కాగ్నిజెంట్‌ వంటి ఐటీ దిగ్గజ కంపెనీలో విశాఖలో అడుగుపెట్టాయి. అదే బాటలో ఐబీఎం తన కార్యాలయాన్ని ఇసుకతోట జంక్షన్‌లోని లాన్సమ్‌ స్క్వేర్‌ భవనంలో నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ప్రముఖ కో-వర్కింగ్‌ స్పేస్‌ ప్రొవైడర్‌ స్ర్పౌట్‌ భాగస్వామ్యంతో ఈ సెంటర్‌లో కార్యకలాపాలు నిర్వహించనున్నది. ఇక్కడ 502 మంది ఉద్యోగులు పనిచేస్తారని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. భవిష్యత్తులో 30 ఎకరాల్లో సొంత క్యాంపస్‌ ఏర్పాటుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించింది. కాగా విశాఖలో ఐబీఎం కార్యాలయం ఏర్పాటును రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖా మంత్రి నారా లోకేశ్‌ స్వాగతించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ‘ఎక్స్‌’ ఖాతాలో లాన్సమ్‌ స్క్వేర్‌లో ఐబీఎం బోర్డును ట్యాగ్‌ చేశారు.

Updated Date - Apr 13 , 2026 | 01:02 AM