Share News

ఐఏఎస్‌ అధికారుల క్రికెట్‌ పోటీల్లో సత్తా

ABN , Publish Date - Jan 04 , 2026 | 11:42 PM

విజయవాడలో ఐఏఎస్‌ అధికారుల క్రికెట్‌ పోటీల్లో తమ ప్రతిభ చాటి కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ జట్టు చాంపియన్‌గా నిలిచింది.

ఐఏఎస్‌ అధికారుల క్రికెట్‌ పోటీల్లో సత్తా
చాంపియన్‌గా నిలిచిన కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ క్రికెట్‌ జట్టు

చాంపియన్‌గా నిలిచిన కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ జట్టు

పాడేరు, జనవరి 4(ఆంధ్రజ్యోతి): విజయవాడలో ఐఏఎస్‌ అధికారుల క్రికెట్‌ పోటీల్లో తమ ప్రతిభ చాటి కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ జట్టు చాంపియన్‌గా నిలిచింది. నిత్యం పరిపాలనా వ్యవహారాలతో తలమునకలవుతున్న ఐఏఎస్‌ అధికారులకు ఊరట కలిగించేందుకు విజయవాడలో క్రికెట్‌ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పలువురు ఐఏఎస్‌ అధికారులతో కూడిన జట్లు పాల్గొన్నాయి. కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న జట్టు ఈ పోటీల్లో చాంపియన్‌గా నిలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది. క్రికెట్‌ పోటీల్లో చాంపియన్‌గా తమ జట్టు విజయం సాధించడంపై కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఆయనకు జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.

Updated Date - Jan 04 , 2026 | 11:42 PM