భారీగా స్ట్రాబెర్రీ దిగుబడులు
ABN , Publish Date - Mar 22 , 2026 | 12:26 AM
ఆంధ్రకశ్మీర్ లంబసింగిలో సీజన్ ఆఖరిలోనూ భారీగా స్ట్రాబెర్రీ దిగుబడులు వస్తున్నాయి. ఉత్తరాది వాతావరణాన్ని పోలి ఉన్న లంబసింగిలో రైతులు పర్యాటక సీజన్‌పై ఆధారపడి ఏడేళ్లుగా స్ట్రాబెర్రీ సాగు చేస్తున్నారు. ప్రతి ఏడాది నవంబరు రెండో పక్షం నుంచి ఫిబ్రవరి వరకు స్ట్రాబెర్రీ దిగుబడులు వస్తాయి.
సీజన్ చివరిలో రావడంపై
లంబసింగి రైతుల ఆనందం
పర్యాటకులు తగ్గడంతో
మైదాన ప్రాంతాల్లో విక్రయం
చింతపల్లి, మార్చి 21 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్రకశ్మీర్ లంబసింగిలో సీజన్ ఆఖరిలోనూ భారీగా స్ట్రాబెర్రీ దిగుబడులు వస్తున్నాయి. ఉత్తరాది వాతావరణాన్ని పోలి ఉన్న లంబసింగిలో రైతులు పర్యాటక సీజన్‌పై ఆధారపడి ఏడేళ్లుగా స్ట్రాబెర్రీ సాగు చేస్తున్నారు. ప్రతి ఏడాది నవంబరు రెండో పక్షం నుంచి ఫిబ్రవరి వరకు స్ట్రాబెర్రీ దిగుబడులు వస్తాయి. మెజారిటీ దిగుబడులను లంబసింగి సందర్శించే పర్యాటకులు కొనుగోలు చేస్తుంటారు. ఈ ఏడాది మార్చిలోనూ స్ట్రాబెర్రీ దిగుబడులు అధికంగా వస్తున్నాయి. మార్చి మొదటి వారంతోనే లంబసింగిని సందర్శించే పర్యాటకుల సంఖ్య పూర్తిగా పడిపోయింది. దీంతో స్ట్రాబెర్రీ తోటలకు వచ్చి కొనుగోలు చేసే సందర్శకులు లేకుండా పోయారు. ప్రస్తుతం స్ట్రాబెర్రీ దిగుబడులను రైతులు చింతపల్లి, లంబసింగి దుకాణాల్లో విక్రయిస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో విక్రయం కావడం లేదు. దీంతో మైదాన ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నారు. 200 గ్రాములు స్ట్రాబెర్రీలు రూ.80ధరకు విక్రయిస్తున్నారు. ఈఏడాది స్ట్రాబెర్రీ తోటల నుంచి అధిక ఆదాయం వచ్చిందని రైతులు చెబుతున్నారు.