అమ్మవారి ధారకొండలో భారీ సర్పం కలకలం
ABN , Publish Date - Apr 07 , 2026 | 12:12 AM
జీకేవీధి మండలం అమ్మవారి ధారకొండ గ్రామంలో సోమవారం భారీ విష సర్పం కలకలం రేపింది. ఒక గిరిజన రైతును కాటు వేయడానికి ప్రయత్నించగా, అతను త్రుటిలో తప్పించుకొని ప్రాణాలను కాపాడుకున్నాడు.
రైతుకు త్రుటిలో తప్పిన ప్రమాదం
సీలేరు, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): జీకేవీధి మండలం అమ్మవారి ధారకొండ గ్రామంలో సోమవారం భారీ విష సర్పం కలకలం రేపింది. ఒక గిరిజన రైతును కాటు వేయడానికి ప్రయత్నించగా, అతను త్రుటిలో తప్పించుకొని ప్రాణాలను కాపాడుకున్నాడు. సుమారు 15 అడుగుల భారీ విషసర్పాన్ని చూసిన గ్రామస్థులు భయాందోళన చెందారు. సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో రైతులు టమాటా పంట పొలానికి వెళ్లి వస్తుండగా భారీ విష సర్పం ఒక రైతును కాటు వేయడానికి ప్రయత్నించింది. అతను త్రుటిలో తప్పించుకొని ఈ విషయాన్ని పొలాల్లో ఉన్న రైతులకు చెప్పాడు. వెంటనే గిరిజన రైతులు అక్కడికి చేరుకుని ఆ భారీ విష సర్పాన్ని హతమార్చారు. ఇటువంటి భారీ సర్పాన్ని ఎప్పుడూ చూడలేదని వారు తెలిపారు. ఇది గిరినాగు అని కొందరు అంటున్నారు. ఈ సర్పం కాటు వేస్తే క్షణాల్లో మరణిస్తారని అంటున్నారు. ఈ ఘటనతో అమ్మవారి ధారకొండ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.