Share News

అల్లం ధర భారీ పతనం

ABN , Publish Date - Oct 03 , 2026 | 11:59 PM

హుకుంపేటలో శనివారం జరిగిన వారపు సంతలో అల్లం ధర భారీగా పతనం అయ్యింది.

అల్లం ధర భారీ పతనం
సంతలో వ్యాపారులు కొనుగోలు చేసిన అల్లం

కిల్లో 15 రూపాయలు

హుకుంపేట, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): హుకుంపేటలో శనివారం జరిగిన వారపు సంతలో అల్లం ధర భారీగా పతనం అయ్యింది. గిరిజన రైతులు తీసుకువచ్చిన అల్లం కిలో 15 రూపాయలకు వ్యాపారులు కొనుగోలు చేశారు. దీంతో గిరిజన రైతులు లబోదిబోమన్నారు. కనీసం ఆటో చార్జీలు కూడా రాలేదని వాపోయారు. తమ కష్టంతో వ్యాపారులను పెంచుతున్నామంటూ రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. జిల్లా కేంద్రం పాడేరులో వారపు సంతని ఏర్పాటు చేస్తే తమకు గిట్టుబాటు ధర లభిస్తుందని వారు ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. జిల్లా అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని గిరిజన రైతులు తెలిపారు.

Updated Date - Oct 04 , 2026 | 12:00 AM