Share News

అరకులోయలో హోటళ్లు మూత

ABN , Publish Date - Mar 13 , 2026 | 10:26 PM

పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం వంట గ్యాస్‌పై పడింది. దీంతో కమర్షియల్‌ గ్యాస్‌ లభించక హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు, టీ స్టాళ్లు వంటి దుకాణాలు మూత పడుతున్నాయి. పర్యాటక ప్రాంతమైన అరకులోయలో గ్యాస్‌ కొరత కారణంగా హోటళ్లు మూతపడ్డాయి.

అరకులోయలో హోటళ్లు మూత
గ్యాస్‌ లేక మూతబడిన అమ్మ హోటల్‌

గ్యాస్‌ లేకపోవడమే కారణం

అరకులోయ, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం వంట గ్యాస్‌పై పడింది. దీంతో కమర్షియల్‌ గ్యాస్‌ లభించక హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు, టీ స్టాళ్లు వంటి దుకాణాలు మూత పడుతున్నాయి. పర్యాటక ప్రాంతమైన అరకులోయలో గ్యాస్‌ కొరత కారణంగా హోటళ్లు మూతపడ్డాయి. గ్యాస్‌ వ్యాన్‌ వస్తున్నప్పటికీ కమర్షియల్‌ సిలిండర్లు రాకపోవడం, ఇళ్లకు వినియోగించే సిలిండర్లు కూడా పూర్తి స్థాయిలో రాకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. వాస్తవానికి టూరిజం రిసార్ట్స్‌కు చెందిన రెస్టారెంట్లు అన్నీ కమర్షియల్‌ గ్యాస్‌పైనే ఆధార పడి ఉన్నాయి. ప్రస్తుతం ఈ రెస్టారెంట్లో కూడా మరో మూడు రోజులు సరిపడే గ్యాస్‌ ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. తర్వాత మా పరిస్థితి ఏమిటోనని వారు ఆందోళన చెందుతున్నారు. హోటళ్ల ఆహారంపై ఆధార పడేవారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

Updated Date - Mar 13 , 2026 | 10:26 PM