Share News

మన్యంలో సెగలు

ABN , Publish Date - Apr 16 , 2026 | 10:56 PM

మన్యంలో ఎండ తీవ్రత అధికంగా ఉంది. గురువారం ఉదయం నుంచే ఎండ ప్రభావం మొదలై, మధ్యాహ్నానానికి తీవ్ర రూపం దాల్చింది.

మన్యంలో సెగలు
పాడేరులో గురువారం గొడుగుతో వెళుతున్న యువకుడు

అరకులోయలో 39.3 డిగ్రీలు

పాడేరు, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): మన్యంలో ఎండ తీవ్రత అధికంగా ఉంది. గురువారం ఉదయం నుంచే ఎండ ప్రభావం మొదలై, మధ్యాహ్నానానికి తీవ్ర రూపం దాల్చింది. దీంతో మధ్యాహ్నం వేళల్లో బయట తిరగలేని పరిస్థితి నెలకొంటున్నది. గత మూడు రోజులుగా రాత్రి, పగలు తేడా లేకుండా ఉక్కపోత కొనసాగుతున్నది. గురువారం అరకులోయలో 39.3, కొయ్యూరులో 38.4, జి.మాడుగులలో 38.0, హుకుంపేటలో 36.5, చింతపల్లి, పెదబయలులో 35.4, అనంతగిరిలో 34.9, ముంచంగిపుట్టులో 33.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - Apr 16 , 2026 | 10:56 PM