అందుబాటులోకి హాట్ ఎయిర్ బెలూన్
ABN , Publish Date - Oct 06 , 2026 | 12:08 AM
పద్మాపురం గార్డెన్‌లో హాట్ ఎయిర్ బెలూన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీనిని కలెక్టర్ టి.నిషాంతి, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ సోమవారం సాయంత్రం పునఃప్రారంభించారు.
పద్మాపురం గార్డెన్‌లో పునఃప్రారంభం
పర్యాటకులకు మరుపురాని అనుభూతిని ఇస్తుందని కలెక్టర్ వెల్లడి
అరకులోయ, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): పద్మాపురం గార్డెన్‌లో హాట్ ఎయిర్ బెలూన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీనిని కలెక్టర్ టి.నిషాంతి, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ సోమవారం సాయంత్రం పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఐటీడీఏ పీవో హాట్ ఎయిర్ బెలూన్‌లో కొద్ది సేపు విహరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ హాట్ ఎయిర్ బెలూన్‌లో విహరించడంతో థ్రిల్లింగ్‌గా ఉందన్నారు. అరకులోయను సందర్శించే పర్యాటకులకు ఇది మరుపురాని అనుభూతిని ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు, గార్డెన్ ఇన్‌చార్జి బొంజిబాబు, తహశీల్దార్ రాజా శ్రీధర్, ఎంపీడీవో వీసం ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.