ప్రారంభానికి సిద్ధంగా హోమియో ఆస్పత్రి
ABN , Publish Date - Jul 19 , 2026 | 11:41 PM
జీకే వీధి మండలం సీలేరులో హోమియో ఆస్పత్రి భవన నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉంది.
మూడు నెలల క్రితం పనులు ప్రారంభించి శరవేగంగా భవన నిర్మాణం
సీలేరు, జూలై 19 (ఆంధ్రజ్యోతి): జీకే వీధి మండలం సీలేరులో హోమియో ఆస్పత్రి భవన నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. రూ.30 లక్షలతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో హోమియో ఆస్పత్రి భవనం నిర్మించారు. ఏడాది క్రితం సీలేరుకు హోమియో వైద్యాధికారిని ప్రభుత్వం నియమించింది. అయితే ఇక్కడ హోమియో ఆస్పత్రి భవనం లేకపోవడంతో స్థానిక పీహెచ్‌సీలోనే ఒక గదిలో హోమియో వైద్యాధికారిణి సృజనారాయ్ వైద్య సేవలు అందిస్తున్నారు. సీలేరులో హోమియో ఆస్పత్రి భవనం నిర్మాణానికి నిధులను మంజూరు చేయాలని వైద్యాధికారిణి కోరడంతో ఆయుష్ అధికారులు స్పందించి నిధులు మంజూరు చేశారు. అలాగే హోమియో ఆస్పత్రి భవన నిర్మాణానికి స్థలం మంజూరు చేయాలని ఆమె స్థానిక జెన్‌కో అధికారులకు దరఖాస్తు చేయడంతో వారు కూడా స్పందించి విజయవాడ విద్యుత్ సౌదా ఉన్నతాధికారుల అనుమతి తీసుకుని స్థానిక పీహెచ్‌సీ పక్కన స్థలం కేటాయించారు. దీంతో మూడు నెలల క్రితం భవన నిర్మాణ పనులు ప్రారంభించి శరవేగంగా పూర్తి చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు త్వరలో భవనాన్ని ప్రారంభిస్తామని వైద్యాధికారిణి సృజనారాయ్ తెలిపారు.