Share News

హోలీ..ఆనందకేళీ

ABN , Publish Date - Mar 05 , 2026 | 01:16 AM

నగరవాసులు బుధవారం హోలీని ఘనంగా జరుపుకున్నారు. చిన్నా, పెద్ద అంతా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా గడిపారు.

హోలీ..ఆనందకేళీ

విశాఖపట్నం, మార్చి 4 (ఆంధ్రజ్యోతి):

నగరవాసులు బుధవారం హోలీని ఘనంగా జరుపుకున్నారు. చిన్నా, పెద్ద అంతా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా గడిపారు. కాలేజీ విద్యార్థులతోపాటు వివిధ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఆర్కే బీచ్‌లో సందడి చేశారు. అలాగే, అనేకచోట్ల అపార్టుమెంట్లలో అసోసియేషన్ల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కొన్నిచోట్ల ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలు సెలబ్రేషన్స్‌ నిర్వహించాయి. అక్కడ రెయిన్‌ డ్యాన్స్‌ చేస్తూ యువత ఎంజాయ్‌ చేశారు. ఎంవీపీ కాలనీ తదితర ప్రాంతాల్లో ఈ తరహా ప్రత్యేక ఈవెంట్లు నిర్వహించారు.

Updated Date - Mar 05 , 2026 | 01:16 AM