Share News

లంబసింగి అభివృద్ధికి అధిక ప్రాధాన్యం

ABN , Publish Date - Jan 22 , 2026 | 11:48 PM

ఆంధ్ర కశ్మీర్‌ లంబసింగి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని ఆంధ్రప్రదేశ్‌ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీటీడీసీ) చైర్మన్‌ నూకసాని బాలాజీ తెలిపారు.

లంబసింగి అభివృద్ధికి అధిక ప్రాధాన్యం
లంబసింగిలో అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న ఏపీటీడీసీ చైర్మన్‌ నూకసాని బాలాజీ

- ఏపీటీడీసీ చైర్మన్‌ నూకసాని బాలాజీ

చింతపల్లి, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర కశ్మీర్‌ లంబసింగి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని ఆంధ్రప్రదేశ్‌ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీటీడీసీ) చైర్మన్‌ నూకసాని బాలాజీ తెలిపారు. గురువారం లంబసింగిని సందర్శించిన ఆయన అక్కడ కొత్త ప్రాజెక్టు కింద నిర్మిస్తున్న 15 గదులను పరిశీలించారు. ఏపీటీడీసీ రిసార్ట్స్‌లో పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తి చేయాలని, పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్ది సేవలందించాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న మెయిన్‌ బ్లాక్‌ను త్వరగా పూర్తి చేయాలని, ల్యాండ్‌ స్కేపింగ్‌ గ్రీనరీని అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఏపీటీడీసీ డివిజనల్‌ మేనేజర్‌ జగదీశ్‌, డీఈలు సత్యనారాయణ, సీతారాం, ఈఈ కె.విజయభాస్కరరెడ్డి, స్థానిక టూరిజం మేనేజర్‌ మాకిరెడ్డి అప్పలనాయుడు ఉన్నారు.

Updated Date - Jan 22 , 2026 | 11:48 PM