Share News

నేడు హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ రాక

ABN , Publish Date - Apr 17 , 2026 | 01:06 AM

రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ శుక్రవారం సాయంత్రం నగరానికి రానున్నారు.

నేడు హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ రాక

మహారాణిపేట, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ శుక్రవారం సాయంత్రం నగరానికి రానున్నారు. 18న జ్యుడీషియల్‌ గెస్ట్‌హౌస్‌ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ మాట్లాడుతూ అధికారులంతా సమన్వయంతో భద్రత, బందోబస్తు, ఇతర ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమావేశంలో అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జి ఎం.వెంకటరమణ, జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ తదితరులు పాల్గొన్నారు.


కలెక్టర్‌తో గూగుల్‌ ప్రతినిధుల భేటీ

విశాఖపట్నం, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి):

జిల్లా కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌తో గురువారం గూగుల్‌ కంపెనీ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్‌ డేటా సెంటర్‌కు ఈనెల 28వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్‌తో పలు విషయాలను వారు చర్చించినట్టు తెలిసింది.

Updated Date - Apr 17 , 2026 | 01:06 AM