పలు చోట్ల భారీ వర్షం
ABN , Publish Date - May 08 , 2026 | 12:33 AM
మన్యంలో గురువారం పలు చోట్ల భారీ వర్షం కురిసింది. జీకేవీధి, హుకుంపేట, ముంచంగిపుట్టులో మధ్యాహ్నం నుంచి ఏకధాటిగా వర్షం పడింది.
రహదారులు జలమయం
పాడేరు, మే 7(ఆంధ్రజ్యోతి): మన్యంలో గురువారం పలు చోట్ల భారీ వర్షం కురిసింది. జీకేవీధి, హుకుంపేట, ముంచంగిపుట్టులో మధ్యాహ్నం నుంచి ఏకధాటిగా వర్షం పడింది. దీంతో రహదారు లు జలమయమయ్యాయి. మిగతా ప్రాంతాల్లో సాధారణ వాతావరణం నెలకొంది. కొయ్యూరు, పాడేరు, జీకేవీధి, జి.మాడుగుల, డుంబ్రిగుడలో 35.5, అరకులోయలో 33.0, చింతపల్లిలో 32.9, అనంతగిరిలో 32.2, ముంచంగిపుట్టులో 31.7, హుకుంపేట, పెదబయలులో 30.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.