Share News

పెదబయలులో భారీ వర్షం

ABN , Publish Date - Mar 14 , 2026 | 11:26 PM

ఏజెన్సీలోని పెదబయలు, అరకులోయ, డుంబ్రిగుడల్లో శనివారం వర్షం కురిసింది. పెదబయలులో భారీ వర్షం కురిసింది.

పెదబయలులో భారీ వర్షం
పెదబయలులో వర్షం

అరకులోయ, డుంబ్రిగుడల్లో మోస్తరు వాన

చిత్తడిగా మారిన రోడ్లు

పెదబయలు, మార్చి 14 (ఆంధ్రజ్యోతి):ఏజెన్సీలోని పెదబయలు, అరకులోయ, డుంబ్రిగుడల్లో శనివారం వర్షం కురిసింది. పెదబయలులో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత కొనసాగింది. అరకులోయ, డుంబ్రిగుడల్లో మధ్యాహ్నం మూడు గంటలకు మోస్తరు వర్షం పడింది. పెదబయలులో సాయంత్రం నాలుగు గంటల తరువాత వాతావణంలో మార్పులు చోటుచేసుకుని ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. కొన్నిచోట్ల వడగళ్లు కూడా పడ్డాయి. దీంతో మండల కేంద్రంలో జనజీవనం కొంతసేపు స్తంభించింది. రోడ్లపై వరద నీరు ప్రవహించగా, మట్టి రోడ్లు చిత్తడిగా మరాయి. వర్షం కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.

Updated Date - Mar 14 , 2026 | 11:26 PM