Share News

కొయ్యూరు, చింతపల్లిల్లో భారీ వర్షం

ABN , Publish Date - Oct 30 , 2026 | 11:13 PM

మండలంలో శుక్రవారం సాయంత్రం గంటసేపు కుంభవృష్టిగా వర్షం కురిసింది.

కొయ్యూరు, చింతపల్లిల్లో భారీ వర్షం
రావణాపల్లి పరిసరాలలో కురుస్తున్న భారీ వర్షం

కొయ్యూరు, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): మండలంలో శుక్రవారం సాయంత్రం గంటసేపు కుంభవృష్టిగా వర్షం కురిసింది. తుఫాన్‌ ప్రభావం తగ్గిన తర్వాత శుక్రవారం ఉదయం నుంచి ఎండ కాసింది. అనంతరం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వాతావరణంలో మార్పు చోటు చేసుకుని ఆకాశం మేఘావృతమైంది. నాలుగు గంటల నుంచి ఏ విధమైన గాలుల ప్రభావం లేకుండా గంటకు పైగా భారీ వర్షం కురిసింది. తుఫాన్‌ ప్రభావం నుంచి తేరుకుంటున్న రైతాంగానికి మరో దపా వర్షం కారణంగా మరింత నష్టం వాటిల్లే పరిస్థితులు నెలకొన్నాయి.

చింతపల్లిలో

మండలంలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మూడు గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. దీంతొ ప్రధాన రహదారాలన్నీ వాగులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు, పంట పొలాల్లో వర్షపు నీరు చేరింది.

Updated Date - Oct 30 , 2026 | 11:13 PM