ఎలమంచిలిలో భారీ వర్షం
ABN , Publish Date - Nov 06 , 2026 | 01:18 AM
పట్టణంలో గురువారం మధ్యాహ్నం అర్ధగంటపాటు భారీ వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అంతకుముందు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వాతావరణం ఎండగా వుంది.
ప్రధాన రహదారులు, కాలనీల్లో రోడ్లు జలమయం
ఎలమంచిలి, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో గురువారం మధ్యాహ్నం అర్ధగంటపాటు భారీ వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అంతకుముందు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వాతావరణం ఎండగా వుంది. తరువాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశం మేఘావృతమై దాదాపు 30 నిమిషాలపాటు ఆగకుండా వర్షం కురిసింది. మెయిన్ రోడ్డుతోపాటు కొత్తపేట ప్రధాన రహదారిపైన, కాలనీల్లో రోడ్లపైన నీరు నిలిచిపోవడంతో రాకపోకలు సాగించేందుకు స్థానికులు ఇబ్బంది పడ్డారు. కొద్దిపాటి వర్షానికే కొత్తపేట ప్రధాన రహదారి జలమయం అవుతున్నది. కానీ మునిసిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.