చింతపల్లిలో భారీ వర్షం
ABN , Publish Date - Apr 04 , 2026 | 11:09 PM
మండలంలో శనివారం భారీ వర్షం కురిసింది.
చింతపల్లి, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): మండలంలో శనివారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సూరీడు చుర్రుమనిపించాడు. మధ్యాహ్నం మూడున్నర గంటలకు వాతావరణంలో మార్పులు నాలుగున్నర గంటల వరకు భారీ వర్షం పడింది. వర్షానికి ప్రధాన రహదారులన్నీ వాగులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలకు వర్షపు నీరు చేరింది. వర్షంతో వాతావరణం చల్లబడింది.