దంచికొట్టిన వాన
ABN , Publish Date - Sep 06 , 2026 | 12:20 AM
కోటవురట్ల మండలంలోని పలు గ్రామాల్లో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత అధికంగా ఉండగా, మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి కుండపోత వాన కురిసింది.
కోటవురట్లలో భారీ వర్షం
అనకాపల్లిలో ఒక మోస్తరుగా..
కోటవురట్ల, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): కోటవురట్ల మండలంలోని పలు గ్రామాల్లో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత అధికంగా ఉండగా, మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి కుండపోత వాన కురిసింది. సుమారు రెండు గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి పంట పొలాల్లో నీరు నిలిచిపోయింది. ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా మెయిన్‌రోడ్డుపై వర్షపు నీరు నిలిచిపోయి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
అనకాపల్లిలో...
అనకాపల్లి టౌన్: పట్టణంలో శనివారం మధ్యాహ్నం ఒక మోస్తరుగా వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రతకు ఇబ్బంది పడిన జనం వర్షంతో ఊరట చెందారు. వర్షం కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో నీరు నిలిచిపోవడంతో డిపో ఉద్యోగులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. విజయరామరాజుపేట అండర్‌బ్రిడ్జి కింద వర్షపునీరు నిలిచిపోవడంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనచోదకులు అవస్థలు పడ్డారు.