Share News

భారీ వర్షం

ABN , Publish Date - Jun 07 , 2026 | 11:18 PM

మండలంలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు కుండపోత వర్షం పడింది. పలు చోట్ల భారీ శబ్దంతో పిడుగులు పడ్డాయి.

భారీ వర్షం
జీకేవీధిలో వర్షం

చింతపల్లి, జీకే వీధి మండలాల్లో కుండపోత

చింతపల్లి, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): మండలంలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు కుండపోత వర్షం పడింది. పలు చోట్ల భారీ శబ్దంతో పిడుగులు పడ్డాయి. వర్షానికి ప్రధాన రహదారులన్నీ వాగులను తలపించాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. వర్షం వల్ల రెండున్నర గంటల పాటు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

జీకేవీధిలో..

గూడెంకొత్తవీధి: మండలంలో భారీ వర్షం కురిసింది. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల వరకు వర్షం పడింది. వర్షానికి ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం వల్ల జర్రెల వారపు సంతలో వినియోగదారులు, వర్తకులు ఇబ్బంది పడ్డారు.

కొనసాగుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు

పాడేరు, జూన్‌ 7(ఆంధ్రజ్యోతి): మన్యంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. ఆదివారం కొయ్యూరులో 39.8, పాడేరు, జీకేవీధి, డుంబ్రిగుడలో 38.3, అరకులోయలో 36.8, అనంతగిరిలో 35.6, చింతపల్లిలో 35.4, జి.మాడుగులలో 34.5, హుకుంపేటలో 33.3, పెదబయలులో 33.1, ముంచంగిపుట్టులో 32.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - Jun 07 , 2026 | 11:18 PM