Share News

దంచికొట్టిన వాన

ABN , Publish Date - May 17 , 2026 | 10:12 PM

అరకులోయలో ఆదివారం మధ్యాహ్నం వర్షం దంచికొట్టింది.

దంచికొట్టిన వాన
డుంబ్రిగుడలో వర్షం

డుంబ్రిగుడ, అరకుల్లో భారీ వర్షం

ఎండ వేడికి ఉపశమనం పొందిన జనం

అరకులోయ, మే 17 (ఆంధ్రజ్యోతి): అరకులోయలో ఆదివారం మధ్యాహ్నం వర్షం దంచికొట్టింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంది. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వాతావరణంలో మార్పులు భారీ వర్షం గంటపాటు కురిసింది. దీంతో వాతావరణం బాగా చల్లబడింది. గత కొన్ని రోజులుగా ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం కురిసిన వానతో జనం ఉపశమనం పొందారు.

డుంబ్రిగుడలో..

మండలంలో ఆదివారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. గత వారం రోజులుగా భానుడి భగభగలతో అల్లాడిన జనం ఈ వర్షంతో సేదదీరారు. ఉదయం నుంచి మబ్బు వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం 12 గంటలకు ఉరుముల, మెరుపులతో భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా మండల వ్యాప్తంగా విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

Updated Date - May 17 , 2026 | 10:12 PM