Share News

భారీ వర్షం

ABN , Publish Date - Apr 21 , 2026 | 11:18 PM

కృష్ణాదేవిపేట, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): గొలుగొండ మండలం ఏఎల్‌పురం, కొంగశింగి, సీహెచ్‌ నాగాపురం, పాతకృష్ణాదేవిపేట, తదితర గ్రామాల్లో మంగళవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది.

భారీ వర్షం
కృష్ణాదేవిపేట ఆర్టీసీ బస్‌ స్టేషన్‌లో వర్షం

కృష్ణాదేవిపేట, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): గొలుగొండ మండలం ఏఎల్‌పురం, కొంగశింగి, సీహెచ్‌ నాగాపురం, పాతకృష్ణాదేవిపేట, తదితర గ్రామాల్లో మంగళవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. ఉదయం నుంచి ఎండ తీవ్రతకు అల్లాడిన జనం వర్షంతో ఊరట చెందారు. ఏఎల్‌పురం మేజర్‌ పంచాయతీ బీసీ కాలనీ, వినాయక వీధుల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. వర్షం వల్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. ఈ వర్షం జీడిమామిడి తోటలకు ఎంతగానో మేలు జరుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Apr 21 , 2026 | 11:18 PM